తెలంగాణ (Telangana ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నాయకులు మొత్తం మాటలు మార్చారు.అంతేకాదు ఎన్నికల ముందు వరకు అందరు నాయకులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు.
అంతేకాదు కొంత మంది అయితే అసభ్య పదజాలాన్ని కూడా వాడారు.కానీ అసెంబ్లీ ఫలితాలు రిజల్ట్ తర్వాత అందరి నాయకుల మాటలు మారిపోయాయి.
ఒక రకంగా చెప్పాలంటే అందరి గొంతులు మూగబోయాయి అని చెప్పుకోవచ్చు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అన్ని శాఖల్లో జరిగిన మోసాలను బయటపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే విద్యుత్, టిఎస్పిఎస్సి ఇలా చెప్పుకుంటూ పోతే భారీ ప్రక్షాళన దిశగా రేవంత్ రెడ్డి ( Revanth reddy ) అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు.

అయితే తాజాగా మేడ్చల్ మాజీ మంత్రి మల్లారెడ్డి ( Mallareddy ) భూ కబ్జా కేసులో ఇరుక్కున్నారు.అంటూ మీడియాలో ఎన్నో వార్తలు బయట పడుతున్నాయి.ఈయన 47 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి నేను ఎలాంటి భూ కబ్జాలు చేయలేదని అన్నారు.మూడు చింతలపల్లి కేశవరం లో 47 ఎకరాల భూ కబ్జా కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇరుక్కున్నారు.

అయితే నాకు ఈ భూకబ్జా చేయాల్సిన అవసరం లేదని,ఈ విషయం మొత్తాన్ని నేను కోర్టులోనే తేల్చుకుంటాను అని అన్నారు.అంతే కాదు అసెంబ్లీ రిజల్ట్ రాకముందు వరకు రేవంత్ రెడ్డి మీదకి తొడలు కొట్టి సవాల్ చేసిన మల్లారెడ్డి తాజాగా మాట మార్చారు.ఆయన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ నాకు రేవంత్ చాలా మంచి స్నేహితుడు.నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఎలాంటి కక్షలు,పగలు లేవు నేను ఎక్కడైనా కనిపిస్తే రేవంత్ రెడ్డి హాయ్ మల్లన్న అని ప్రేమగా పలకరిస్తారు అంటూ మాట్లాడారు.
అంతేకాదు భూకబ్జా కేసులో నన్ను ఇరికించడం ప్రభుత్వం కక్ష సాధింపేనని చెప్పుకొచ్చారు.అయితే మొన్నటి వరకు రేవంత్ రెడ్డి పై సంచలన కామెంట్లు చేసి అసభ్య పదజాలాన్ని ఉపయోగించి ఇప్పుడేమో నేను రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ ని అని,ఆయన నన్ను మల్లన్న అని ప్రేమగా పిలుస్తారు అంటూ మాట్లాడడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది.
అంతేకాదు అప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా మల్లారెడ్డి మాట్లాడుతున్నారు.బహుశా రేవంత్ రెడ్డికి భయపడే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కావచ్చు అంటూ కాంగ్రెస్ వాళ్లు భావిస్తున్నారు
.