ఈటెల, రేవంత్ రెడ్డి, రాజాసింగ్ లపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ( KTR )ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇంక మూడు వారాలు మాత్రమే టైమ్ ఉండటంతో ఒకపక్క ప్రజలకు హామీలు ఇస్తూనే మరోపక్క ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.

తాజాగా మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ పేరిట కుట్ర చేస్తుందని ఆరోపించారు.ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో ఈటెల, రేవంత్ రెడ్డి, రాజాసింగ్( Etela, Revanth Reddy, Rajasingh ) లను.ఈ ముగ్గురిని కచ్చితంగా ఓడిస్తామని స్పష్టం చేశారు.

త్వరలో జరగబోయే ఎన్నికలలో బీజేపీ( BJP ).దమ్ముంటే ఒక సీట్ అయినా గెలుచుకోమని బహిరంగంగా సవాల్ చేశారు.గోష్ మహాల్ నియోజకవర్గంలో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగైనా సరే రాజాసింగ్ ను ఓడించి తీరుతామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Advertisement

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో.అదేవిధంగా బీజేపీ నేత ఈటెల రాజేందర్ నీ హుజురాబాద్ లో ఓడిస్తామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ టికెట్లను అమ్ముకుంటూ నాయకుల సెంటిమెంట్ తో ఆడుకుంటుందని మండిపడ్డారు.

జరగబోయే ఎన్నికలలో కచ్చితంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీ లను ఓడించి గెలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు