పవన్‎కు మంత్రి కారుమూరి సవాల్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి కారుమూరి సవాల్ విసిరారు.

వచ్చే ఎన్నికల్లో తణుకు నుంచి పవన్ పోటీ చేస్తే తాను కూడా పోటీకి సిద్ధమని చెప్పారు.

టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైసీపీ విజయాన్ని ఆపలేరని పేర్కొన్నారు.

చంద్రబాబు, లోకేశ్ లు పాదయాత్రలు చేసినా ఒరిగేదేమీ లేదని వెల్లడించారు.లోకేశ్ పాదయాత్రను ప్రజలు జోకర్ లా చూస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే తమ ఓటు బ్యాంక్ అని మంత్రి తెలిపారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)