సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని కొన్ని చాలా ఆసక్తికరంగా ఉంటాయి.అవును, తాజాగా ఆకాశంలో ఓ వింత మేఘం స్థానికులతో పాటు నెటిజన్లను సైతం కనువిందు చేసింది.
ఈ చిత్ర విచిత్రమైన సంఘటన టర్కీలోని బుర్సా నగరంలో జరగగా తాజాగా వెలుగు చూసింది.ఈ మేఘాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయి, దానికి ఫోటోలు, వీడియోలు తీశారు.
టర్కీలోని బుర్సా నగరంపై ఈ వింత సంఘటన చోటుచేసుకుంది.UFO ఆకారంలో, గులాబీ రంగులో ఆ మేఘం సందడి చేసింది.

దీంతో అక్కడి స్థానికులు ఆ మేఘాన్ని తమతమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీంతో క్షణాల్లోనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా కావడం మనం ఇక్కడ గమనించవచ్చు.ప్రజలు ఈ గురువారం ఈ రంగురంగుల భారీ మేఘాన్ని చూశారు.ఈ భారీ మేఘం టర్కీలోని వివిధ నగరాల్లో కూడా కనిపించినట్లు అక్కడి మీడియాలు ప్రకటించాయి.ఈ వీడియోను చూసి చాలా మంది భిన్న రకాలుగా స్పందించడం సోషల్ మీడియాలో మనం గమనించవచ్చు.

దానిని చూసి కొంతమంది తేనెటీగ గొడుగుగా కనిపిస్తుందని వారిస్తుంటే, మరి కొందరు దీనిని UFO మాదిరిగా ఉందని అంటున్నారు.ఇంకొందరు నెటిజన్లయితే అచ్చం గులాబీ పువ్వులా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.ఇక టర్కీలో ఏర్పడిన ఈ భారీ మేఘం తాలూకా వీడియో, ఫోటోలు ఇపుడు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లలో దర్శనం ఇస్తున్నాయి.
అంతలా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంకెందుకాలస్యం, మీరు కూడా దీనికి చూసి మీమీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.







