జనసేన పార్టీపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.జనసేన పార్టీకి దశదిశ లేదన్నారు.
పార్టీ ఆవిర్భావ సభలో కులాల గురించి తప్పితే ఏమీ లేదని తెలిపారు.
సీఎం జగన్ ను తిట్టడం తప్ప పవన్ కల్యాణ్ కు మరొక ఆలోచన లేదని మంత్రి కారుమూరి మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో.ఏ కులాలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పరని విమర్శించారు.
పవన్ కు పొత్తులపై కూడా క్లారిటీ లేదన్నారు.కనీసం తను మాట్లాడే దానిపై కూడా పవన్ కు క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు.







