ఆసాని తుఫాన్ పరిస్థితులు ఎదుర్కొనేందుకు తూర్పు నౌకాదళం సిద్ధం ఏపీ ఒరిస్సా ప్రాంత అధికారులతో నేవీ అధికారుల సమీక్ష 19 ఫ్లడ్ రిలీఫ్ టీమ్లు ఆరు డైవింగ్ టీంలు… జెమినీ క్రాఫ్ట్ సిద్ధంచేసిన అనేవి సహాయ సామగ్రి తో ఐదు యుద్ధనౌకలు విశాఖ కేంద్రంగా మోహరింపు ఐఎన్ఎస్ డేగా లో ఎయిర్ క్రాఫ్ట్ .చెన్నైలో ins రజాలి యుద్ధనౌక తుఫాన్ సహాయ చర్యల కోసం సిద్ధం అలాగే వీరితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చేపట్టింది అందుకుగాను అసాని తుపాను విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి మంత్రి విడదల రజిని కలెక్టర్ ఎ.
మల్లికార్జునరావుకు ఆదేశాలు జారీ చేశారు.ఉత్తరాంధ్రపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటం, వర్షాలు జోరందుకున్న నేపథ్యంలో ఆమె మంగళవారం కలెక్టర్ తో మాట్లాడారు.
అసాని తుపాను బాధితులుగా జిల్లాలో ఒక్కరు కూడా ఉండటానికి వీల్లేదని తెలిపారు.ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు చేపట్టాలన్నారు.విద్యుత్ కోత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
కరెంటు స్తంభాలు, చెట్లు.ఇలా వేటికి నష్టం వాటిల్లినా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
జనజీవనానికి విఘాతం కలగకుండా చూడాలన్నారు.డ్రెయినేజి వల్ల నష్టం జరగకుండా చూడాలన్నారు.
రెస్య్కూ టీంల ను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలన్నారు.తీర ప్రాంత వాసులను అప్రతమత్తం చేయాలన్నారు.
పునరావాస కేంద్రాల వద్ద వసతి, భోజన సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు.అందుకుగాను జిల్లాలోని అధికారులందరూ మంత్రి కలెక్టర్ ఆదేశాల మేరకు అసాని తుఫాన్ వలన ముందస్తు జాగ్రత్తగా అధికారులు చేపట్టినారు గాజువాక,పెదగంట్యాడ లోతట్టు ప్రాంతాల ప్రజలకు తుఫాను షెల్టర్లు ఏర్పాటు.
పునరావాస కేంద్రాలు షీలానగర్ లో వికాష్ కళాశాల, మింది హైస్కూల్ , ద్రోణంరాజు కళ్యాణమండపం, శ్రీకృష్ణదేవరాయ కళ్యాణమండపం,పెదగంట్యాడ ప్రజలకు ఇండోర్ స్టేడియం, తుఫాన్ షెల్టర్ హెచ్ బి కాలనీలలో ప్రభుత్వం సహాయక ఏర్పాట్లు చేసింది
.