ఎన్నికల సమయం దగ్గరికి వస్తున్న కొలది బీఆర్ఎస్ (BRS) దూకుడు పెంచేస్తోంది.ముఖ్యంగా వ్యూహాలను అమలుపరిచే విధంగా రెండు రేసుగుర్రాలు రాష్ట్రమంతా పర్యటిస్తూ, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చెబుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు.
ఇందులో భాగం గానే ప్రతిపక్ష నాయకుల మాటలను, తిప్పికొడుతూ ముందుకు కదులుతున్నారు మంత్రి హరీష్ రావు(Harishrao) కేటీఆర్(ktr).బుధవారం మంత్రి హరీష్ రావు కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి(Revanthreddy) తప్పనిసరిగా జైలుకు వెళ్తారని అన్నారు.దీనిపై సుప్రీంకోర్టు కూడా విచారణ చేయాలంటూందని తెలిపారు.

ఎన్ని వ్యూహాలు పన్నినా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారని తెలియజేశారు.కొడంగల్ కు రేవంత్ రెడ్డి ఒక్క ఆసుపత్రి కూడా తీసుకు రాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు ఆసుపత్రులను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు.కోడంగల్ లో(kodamgal) 46 తండాలను గ్రామపంచాయతీలు చేశామని, నారాయణపేటలో 180 కోట్లతో మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందే అని గుర్తు చేశారు.కొడంగల్ ఎమ్మెల్యేగా నరేందర్ రెడ్డి(Narendar Reddy) గెలిచిన తర్వాత ఇంటింటికి శుద్ధ మంచినీరు అందుతోందని, ఒకవేళ రేవంత్ గెలిచి ఉంటే, ఇంకా పది ఏళ్లయిన మంచినీళ్లు వచ్చేవి కాదని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

వ్యవసాయం చేయడం దండగ అని చంద్రబాబు నాయుడు(Chandrababu) అంటే, 24 గంటల కరెంటు దండగా అని ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి అన్నారని విమర్శించారు.రైతులకు మూడు గంటల కరెంటు చాలని తన కడుపులో ఉన్న మాటను బయటపెట్టరని మంత్రి తీవ్రంగా మండిపడ్డారు.కర్ణాటకను(karnataka) పాలిస్తున్న కాంగ్రెస్ 600 రూపాయల పెన్షన్ ఇస్తుందని, తెలంగాణలో 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని, మళ్లీ అధికారంలోకి రాగానే 4000 పెన్షన్ అందిస్తామని తెలియజేశారు.
తెలంగాణలో బిజెపి(BJP) లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదని దుయ్యబట్టారు.
మరోసారి కేసీఆర్(KCR) ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆనందం వ్యక్తం చేశారు.త్వరలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారని, కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుందని అన్నారు.







