కలియుగ రావణాసురులు చంద్రబాబు లోకేష్ అని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.శనివారం మంత్రి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పనికిమాలిన కుట్రలు కుతంత్రాలు చేసి బీసీ వర్గానికి చెందిన ఎంపి గోరంట్ల మాధవ్ పై మార్ఫింగ్ వీడియోలు సృష్టించి సునకానందం పొందుతున్నారన్నారు.
గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ వీడియో అని తెలిసినా ఏదోవిధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారని ఇలాంటి కుట్రలు ఎన్ని పన్నినా తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.
చంద్రబాబు అమ్మాయిలను రాజకీయంగా వాడుకోవడం తప్ప ఆదుకోవడం తెలియదన్నారు….