పారిశ్రామికవేత్తలకు ఏపీ అనుకూలమని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు.
పరిశ్రమల కోసం 40 వేల ఎకరాలు సిద్ధం చేశామని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి జీఐఎస్ దోహదపడుతుందని తెలిపారు.త్వరలో మచిలీపట్నం, భావనపాడు పోర్టులు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.ఉపాధి అవకాశాలు కల్పించాలన్న నిబంధన ప్రకారం ఒప్పందాలు చేసుకున్నామన్నారు.
ప్రతి నెలలో కనీసం ఒక పరిశ్రమ వచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.







