ఆ మాజీ మంత్రి రాజకీయ జీవితం గందరగోళంలో పడిందా ?

రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఒకే రకమైన పరిస్థితులు ఉండవు.

ఉన్నత స్థానంలో ఒక వెలుగు వెలిగి న వారే ఆ తరువాత తమ రాజకీయ జీవితం అయోమయం లో పడి ఎటు వెళ్లాలో తేలని గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్లిపోతుంటారు.

ఇప్పుడు ఆ విధంగానే టీడీపీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం ఎమ్యెల్యేగా ఉన్న ఘంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితం కూడా అయోమయంలో పడింది.అసలు ఎన్నికల ముందే టీడీపీ ని వీడి మరో పార్టీలోకి ఘంటా వెళ్తారని ప్రచారం జోరుగా సాగినా ఆయన మాత్రం ఏ పార్టీలో చేరకుండా సైలెంట్ గా ఉండిపోయారు.

అలా అని టీడీపీలో ఆయన యాక్టివ్ గా ఉన్నారా అంటే అదీ లేదు.టీడీపీలో ఆయన ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తూ అందరిని అయోమయంలోకి నెట్టేస్తున్నాడు.

అదే సమయంలో మెగా స్టార్ చిరంజీవితో సన్నిహితంగా ఉంటూ అందరిని మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నారు.ఘంటా శ్రీనివాసరావు పార్టీ మారడం దాదాపు ఖాయమే అన్నట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నా ఆయన మాత్రం ఏ పార్టీలో చేరతారు అనే విషయం ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది.

Advertisement

జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన లాంగ్‌ మార్చ్‌కు టీడీపీ మద్దతు ఇచ్చింది.అయినా అక్కడకు ఘంటా రాలేదు.

టిడిపి అధినేత చంద్రబాబు మద్దతు ప్రకటించడంతో పాటు తమ పార్టీ తరపున గంటా శ్రీనివాస్ రావు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు హాజరవుతారని కూడా పేర్లతో సహా ప్రకటించారు.

లాంగ్‌ మార్చ్ జరిగిన టైమ్‌లో గంటా విశాఖలోనే ఉన్నా అక్కడకు వెళ్ళలేదు.సాక్షాత్తు అధినేత చంద్రబాబు సమావేశానికి వెళ్లాల్సిందిగా ఘంటాకు సూచించినా ఎందుకు ఆయన ఆదేశాలు పట్టించుకోలేదు అనేది క్లారిటీ లేకుండా పోయింది.ఘంటా రాజకీయ జీవితం చూసుకుంటే ఆయన మొదటి నుంచి ఏ పార్టీలోనూ స్థిరంగా లేరు.

మొదట్లో టీడీపీ లో ఉన్న ఆయన ఆ తరువాత ప్రజారాజ్యంలో చేరారు.ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో ఆ పార్టీలో ఉండిపోయారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

మళ్ళీ 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు.ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు.

Advertisement

ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.అది వర్కవుట్ కాకపోవడంతో టీడీపీలోనే ఉండిపోయారు.

ఆ పార్టీ నుంచే శాసనసభ్యుడిగా గెలుపొందారు.ప్రస్తుతం ఘంటా చూపు మొత్తం బీజేపీ మీదే ఉన్నట్టు కనిపిస్తోంది.

కానీ ఆయన మాత్రం తన మనసులో మాట ఏంటి ? రాజకీయ అడుగులు ఎటువైపు అనే విషయంలో ఏ క్లారిటీ ఇవ్వకుండా గందరగోళానికి కారణం అవుతున్నారు.

తాజా వార్తలు