Minister Errabelli Dayakar Rao: మునుగోడు నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..

మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో భాగంగా చండూరు 2వ, 3వ వార్డులలో ఇంటింటి ప్రచారం చేస్తున్న ఆ రెండు వార్డుల ఇంచార్జీ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.మంత్రికి నుదుట తిలకం దిద్దుతూ, ఘనంగా స్వాగతం పలికిన మహిళలు, ఆయా వార్డుల ప్రజలు.

 Minister Errabelli Dayakar Rao Campaign In Munugode By Elections Details, Minist-TeluguStop.com

డప్పు చప్పుళ్లతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళుతూ, టీఆరెఎస్, కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించిన మంత్రి.

ప్రజలను కలుస్తూ, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ, వారి పనుల్లో మమేకం అవుతూ, వారితో మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ, ప్రచారం నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

మంత్రి ఎర్రబెల్లి తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ప్రచారంలో పాల్గొ0టున్నారు.ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ, ఆయా పథకాలు అందుతున్నాయా? అంటూ ఆరా తీస్తూ ముందుకు సాగుతున్న మంత్రి.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్.మునుగోడు నియోజకవర్గం, చండూరు లోని 2వ, 3వ వార్డులను దత్తత తీసుకుంటున్న.ఈ రెండు వార్డుల రూపు రేఖలు మారుస్తా.అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తా.సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువలు నిర్మిస్తా.అందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చూస్తా.

ఇప్పటిదాకా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళను ఓడించాలి.కారు, సారు, సర్కారు ను మరువొద్దు.

టీఆరెఎస్ నే గెలిపించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube