ప్రశాంత్ కిషోర్ పై మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ ఎన్నికలలో( AP elections ) ఎవరు గెలుస్తారు అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది.జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడనున్నాయి.

ఏపీలో ఎన్ని పార్టీలు పోటీ చేసిన ప్రధాన పోటీ టీడీపీ కూటమి.వైసీపీ మధ్య నెలకొంది.

కూటమి పార్టీలకు చెందిన నాయకులు తామే అధికారంలోకి వస్తామని అంటున్నారు.వైసీపీ అధినేత జగన్ 2019 కంటే ఈసారి అత్యధిక సీట్లు గెలుస్తామని చెబుతున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) ఏపీ ఎన్నికల ఫలితాలు గురించి స్పందించారు.ఏపీలో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని పేర్కొన్నారు.

Advertisement

ఓ ప్రముఖ జర్నలిస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ.

ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా.? ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అంటూ సెటైర్లు వేశారు.ప్రశాంత్ కిషోర్ క్యాష్ పార్టీ.

ఆయన కమర్షియల్ అని తెలుసుకొని.వన్ టైం వ్యవహారం తర్వాత వదిలేసినట్లు పేర్కొన్నారు.

వైసీపీ కోసం ఐప్యాక్ నిర్మాణాత్మకంగానే పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.ప్రశాంత్ కిషోర్ అయిన ఐప్యాక్ అయిన తాత్కాలికమేనని వైసీపీ మాత్రమే శాశ్వతమని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
వీడియో వైరల్ : బ్రేక్ డాన్యులతో స్వామి వారి ఊరేగింపు

ఎన్నికలు ముగిసాయి భవితవ్యం బ్యాలెట్ బాక్స్ లలో ఉన్నాయి.మేం గెలుస్తామని జూన్ 9న ప్రమాణ స్వీకారం అని చెప్పాం.

Advertisement

కచ్చితంగా జరిగిన ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని.పేర్కొన్నారు.

పరిపాలన చూసి ఓటేయాలని సీఎం జగన్ ( CM Jagan )లా ప్రధాని మోదీ కూడా ఓటు అడగలేకపోయారు.మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని సీఎం జగన్ మాత్రమే అడిగారు.

ఓ రకంగా రాజకీయాలలో సీఎం జగన్ ఈ రకమైన ప్రచారంతో ట్రెండ్ సెట్ చేశారు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు