అరటి పంటను వేరు తోలుచు పురుగుల నుంచి సంరక్షించే పద్ధతులు..!

అరటి పంట( Banana crop )ను ఆశించి తీవ్ర నష్టం కలిగించే వేరు తోలుచు పురుగులు ముదురు గోధుమ రంగు నుండి బూడిద నలుపు రంగులు మెరుస్తున్నటువంటి తోడుగు కలిగి ఉంటాయి.

ఈ పురుగులు మొక్క కింది భాగంలో పంట అవశేషాలలో లేదంటే మొక్క ఆకుల తోడిమల్లో జీవిస్తాయి.

ఈ పురుగులు ఆహారం తినకుండా కొన్ని నెలల పాటు ఉండగలవు.ఆడ పురుగులు తెలుపు రంగులో గుండ్రపు గుడ్లని పంట అవశేషాల్లో పెడతాయి.

లార్వాల ద్వారా బయటికి వచ్చిన వెంటనే కాండాల ద్వారా వేర్లలో రంద్రాలు చేసి మొక్కను బలహీన పరుస్తాయి.ఒక పంట నుండి ఇంకొక పంటకి సహజంగా తెగులు సోకిన పంట పదార్థాల ద్వారా ఇవి ఎక్కువగా వ్యాపిస్తాయి.

Methods To Protect The Banana Crop From Root Bark Beetles ,banana Crop, Banana

అరటి మొక్కలపై పాలిపోయిన ఆకుపచ్చ మచ్చలు, వాలిపోవడం మరియు రాలిపోయిన ఆకులు తీవ్రం అయితే ఈ పురుగులు పంటను ఆశించినట్టే.ఈ పురుగులు ఆశించిన లక్షణాలు మొక్క కాండం కింది భాగాలలో గమనించవచ్చు.చిన్న మొక్కలు పెరగవు, పెద్ద మొక్కలు ఎదగవు.

Advertisement
Methods To Protect The Banana Crop From Root Bark Beetles ,banana Crop, Banana

ఈ పురుగులు ఆశించిన మొక్కలకు నీరు మరియు పోషకాలు సరిగా అందవు.ఈ పురుగులను సకాలంలో గుర్తించి అరికట్టకపోతే అరటి గెలల సంఖ్య మరియు పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది.

Methods To Protect The Banana Crop From Root Bark Beetles ,banana Crop, Banana

తెగులు నిరోధక రకాలను మాత్రమే ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.మొక్కలకు ఉపయోగపడే కీటకాలు( Insects ), చీమలను ప్రోత్సహించాలి.ఆడ పురుగుల్ని ఆకర్షించడం కోసం కాడలు మరియు వేర్ల భాగాలను రెండు భాగాలుగా కత్తిరించి భూమిలో పాతిపెట్టాలి.

రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.ఏదైనా తీగజాతి పంటలు వేసిన తర్వాత అరటి పంట వేస్తే ఇలాంటి పురుగులు ఆశించే అవకాశం ఉండదు.

రసాయన పిచికారి మందులైన క్లోరోఫాస్, మలాథియాన్( Chlorophos, Malathion ) లను ఉపయోగించి ఈ పురుగులను పూర్తిగా అరికట్టవచ్చు.

Advertisement

తాజా వార్తలు