టమాటో పంటకు( Tomato Crop ) ఏడాది పొడవునా ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.
కాబట్టి టమాటో పంటను అధికంగా సాగు చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ పంటపై పూర్తి అవగాహన ఉంటేనే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.కాబట్టి ఈ పంటను ఆశించే చీడపీడల , తెగుళ్ల( Pests ) పూర్తి అవగాహన ఉండి, వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి అరికడితే మంచి దిగుబడి పొందవచ్చు.
టమాటో పంటకు పసుపు రంగు ఆకుముడత వైరస్( Yellow Leaf Blight Virus ) తెగులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.ఈ తెగులు తెల్ల దోమల వల్ల వ్యాపిస్తుంది.
తెల్ల దోమలు ఆకుల అడుగుభాగం పై దాడి చేసి, ఈ తెగులను వ్యాప్తి చెందుతాయి.ఈ మొత్తం సంక్రమణ 24 గంటల్లో జరిగిపోతుంది.
పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలలో ఈ తెగుల అధికంగా ఉంటుంది.ఈ తెగులు పంటను ఆశించిన తర్వాత మొక్కల ఎదుగుదల సరిగా ఉండదు.
ఆకులు పచ్చదనం కోల్పోయి పాలిపోయి నట్టు ఏర్పడతాయి.టమాటో పండ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది.
ఈ తెగుల లక్షణాలను గుర్తించడం చాలా కష్టం.
టమాటో సాగు చేసే రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సాగు చేయాల్సి ఉంటుంది.మార్కెట్లో దొరికే తెగులు నిరోధక విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకుని సాగు చేయాలి.తెల్ల దోమల వ్యాప్తిని( White Mosquitoes ) తగ్గించడానికి ముందే మొక్కలను నాటుకోవాలి.
కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.పంట పొలంలో అక్కడక్కడ పసుపు జిగురు ప్లాస్టిక్ వలలను ఏర్పాటు చేయాలి.
తెగులు సోకిన మొక్కలను వెంటనే పంట నుండి వేరు చేయాలి.ఈ తెగులను పూర్తిగా అరికట్టడం అసాధ్యం.కాబట్టి ఈ వైరస్ సంక్రమణలు నివారించాలంటే ముందుగా తెల్ల దోమల జనాభాను నియంత్రించుకోవాలి.
పెరిథ్రాయడ్ జాతికి చెందిన శిలీంద్ర నాశినిలను ఉపయోగించడం వల్ల తెల్ల దోమల వ్యాప్తిని తగ్గించుకోవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy