బొప్పాయి పంటను ఆకుపచ్చ పీచు ఆఫిడ్స్ తెగుళ్ల బెడద నుంచి సంరక్షించే పద్ధతులు..!

ఉద్యానవన తోటల్లో సులభంగా సాగు నిర్వహించే తోటగా బొప్పాయి తోటను( Papaya Crop ) చెప్పుకోవచ్చు.

బొప్పాయి తోటల సాగు విధానంపై కాస్త అవగాహన ఉంటే చాలు మంచి దిగుబడులు సాధించవచ్చు.

బొప్పాయి మొక్కలు చెక్కతో కూడిన చెట్టు లాంటి మొక్కలు, ఈ బొప్పాయి మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి.ఇసుకతో కూడిన నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలం.నేల యొక్క పీహెచ్ విలువ 6 నుండి 6.5 వరకు ఉంటే చాలా అనుకూలం.బొప్పాయి సాగుకు మంచి నీటిపారుదల ఉన్న, సారవంతమైన నేలలు చాలా అనుకూలం.

Methods Of Protecting Papaya Crop From The Pest Of Green Peach Aphids Details,

బొప్పాయి పెరుగుదలకు అనువైన ఉష్ణోగ్రత 25 నుండి 35 డిగ్రీలు.ఉష్ణోగ్రత 12 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే మొక్కల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.బొప్పాయి మొక్క( Papaya Plant ) ఎండాకాలంలో బాగా పెరుగుతుంది కానీ గాలి మరియు చల్లని వాతావరణం నుండి రక్షించబడాలి.

బలమైన తీవ్ర గాలుల నుండి బొప్పాయి మొక్కలను రక్షించడం కోసం విండ్ బ్రేకులు ఉపయోగించాలి.నేల నుండి వివిధ రకాల తెగుళ్లు( Pests ) బొప్పాయి మొక్కలను ఆశించకుండా ఉండాలంటే ముందుగా విత్తనాలను విత్తన శుద్ధి చేయాలి.ఒక లీటరు నీటిలో 1.25 మిల్లీ లీటర్ల గిబ్బరెల్లిక్ యాసిడ్ ను కలిపి ఆ ద్రావణంతో విత్తన శుద్ధి చేయాలి.ఆ తర్వాత ఒక లీటర్ నీటిలో 0.8గ్రాముల కార్బండజిమ్ 50%WP ను కలిపి ఆ ద్రావణంతో విత్తన శుద్ధి చేయాలి.

Methods Of Protecting Papaya Crop From The Pest Of Green Peach Aphids Details,
Advertisement
Methods Of Protecting Papaya Crop From The Pest Of Green Peach Aphids Details,

బొప్పాయి పంట నాటుకునేందుకు అనువైన సమయం జూన్- సెప్టెంబర్.మంచు నష్టం నుండి తప్పించుకోవాలంటే ఈశాన్య ప్రాంతాల్లో సాగు చేసే రైతులు ఫిబ్రవరి నుండి మార్చి వరకు నాటుకోవచ్చు.బొప్పాయి పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ళ విషయానికి వస్తే ఆకుపచ్చ పీచు అఫిడ్స్ తెగులు( Green Peach Aphid ) కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ తెగుళ్లు సోకిన ఆకుల మొక్కలు వంకరగా టింకరగా తిరుగుతాయి.పండ్లు అకాల డ్రాప్ కారణం అవుతాయి.ఈ తెగులు గుర్తించిన తర్వాత మొక్క యొక్క దెబ్బతిన భాగాలను తొలగించి నాశనం చేయాలి.

సేంద్రియ పద్ధతిలో ఈ తెగుళ్లను అరికట్టాలంటే.ఒక లీటరు నీటిలో మూడు మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారి చేయాలి.

రసాయన పద్ధతిలో ఈ తెగులను అరికట్టాలంటే.ఒక లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల బెనెవియా ను కలిపి పిచికారి చేయాలి.

Advertisement

తాజా వార్తలు