నూనె గింజల పంటలలో వేరుశనగ ప్రధాన పంట( Ground nut crop )గా ఉంది.ఈ పంట సాగుకు కాస్త పెట్టుబడి ఎక్కువే.
అంతే కాదు చీడపీడల, తెగుళ్ల బెడద కూడా ఎక్కువే.వేరుశనగ పంటను సస్యరక్షక పద్ధతులు పాటిస్తూ పంటను సంరక్షించుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.

ఈ వేరుశనగ పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగులలో తుప్పు తెగులు కీలక పాత్ర పోషిస్తాయి.భూమిలో ఉండే పంట వ్యర్ధాల ద్వారా ఈ తెగులు పంటను ఆశిస్తాయి.ఈ తెగుల వ్యాప్తి వేగంగా విస్తరిస్తుంది.కాస్త అధిక మొత్తంలో ఫాస్పరస్ ఎరువులు వాడడం వల్ల ఈ తెగుల వ్యాప్తి విస్తరించకుండా ఆపవచ్చు.వేరుశనగ మొక్కల ఆకులపై చిన్న సైజులో గుండ్రపు నారింజ గోధుమ రంగు బొడిపెలు ఏర్పడితే ఆ మొక్కలకు తుప్పు తెగుళ్లు సోకినట్టే.ఈ తెగులు ఆకుల ఎదుగుదలను దెబ్బతీస్తాయి.
ఆ తర్వాత క్రమంగా కొమ్మలు కాండానికి విస్తరించి దిగుబడి తగ్గేలా చేస్తాయి.ఈ తెగుల వల్ల వేరుశనగ నూనె నాణ్యత పూర్తిగా దెబ్బతింటుంది.

వేరుశనగ పంటకు తెగుళ్లు ఆశించకుండా ఉండాలంటే తెగులు నిరోధక వంగడాలను ఎంపిక చేసుకుని సాగు చేయాల్సి ఉంటుంది.మొక్కల మధ్య దూరం ఉంటే సూర్యరశ్మి, గాలి వల్ల మొక్క చుట్టూ అధిక తేమ చేరకుండా మొక్క ఆరోగ్యకరంగా పెరిగి వివిధ రకాల తెగుళ్లు ఆశించకుండా ఉండే అవకాశం ఉంటుంది.తుప్పు తెగులను గుర్తిస్తే.ఫాస్పరస్ ఎరువులను( Phosphorus fertilizers ) ఉపయోగించాలి.ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపును నివారించే చర్యలు చేపట్టాలి.
ఈ తెగులను గుర్తించిన తర్వాత మొక్కలను పీకేసి నాశనం చేయాలి.ఆ తరువాత మాంకోజెబ్, ప్రోపికొనజాల్ లలో ఏదో ఒక దానిని పిచికారి చేయాలి.
తర్వాత 15 రోజులకు మరోసారి పిచికారి చేస్తే ఈ తెగులు అరికట్టబడతాయి.