దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన ‘సీతారామం‘ చిత్రం ఆసక్తికరమైన ప్రొమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలు పెంచుతోంది.ముఖ్యంగా పాటలకు విశేషమైన స్పందన వచ్చింది.
తాజాగా ఈ చిత్రం నుండి థర్డ్ సింగిల్ ‘కానున్న కళ్యాణం’ పాట లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ పాట మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ గా విన్న వింటనే ఆకట్టుకుంది.
విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది.అనురాగ్ కులకర్ణి, సిందూరి ఈ పాటని ఆలపించిన విధానం అద్భుతంగా వుంది.
లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం పదికాలాలు గుర్తుపెట్టుకునేలా వుంది.
♪♪కానున్న కళ్యాణం ఏమన్నది ? స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ? ప్రతి క్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపు లేని గాధగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా.♪♪
పాట పల్లవిలో వినిపించిన ఈ సాహిత్యం మనసుకి గొప్ప హాయిని నింపేలా అనిపించాయి.అద్భుతమైన లోకేషన్స్ చిత్రీకరించిన ఈ పాట చాలా ఆహ్లాదకరంగా వుంది.
ముఖ్యంగా దుల్కర్, మృణాల్ మ్యజికల్ గా కనిపిస్తుంది.
ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో సర్ప్రైజ్ చేయనున్నారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది.స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దృశ్య కావ్యంగా తెరకెక్కుతున్న ‘సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు.
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం:
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: హను రాఘవపూడి, నిర్మాత: అశ్వినీదత్, బ్యానర్: స్వప్న సినిమా, సమర్పణ: వైజయంతీ మూవీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్, ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు, ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, అలీ, కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ, పీఆర్వో : వంశీ-శేఖర్
.