అమెరికా: భారత్‌కు ఆయుధ విక్రయాలు వేగవంతం .. కీలక చట్టం ప్రవేశపెట్టిన ఇండియా కాకస్ సభ్యులు

అమెరికా చట్టసభల్లోని శక్తివంతమైన ఇండియా కాకస్ సభ్యులు.భారతదేశ రక్షణ అవసరాల నేపథ్యంలో ఓ ద్వైపాక్షిక చట్టాన్ని ప్రవేశపెట్టారు.

భారతదేశం తనను తాను రక్షించుకోవడంతో పాటు .వ్యూహాత్మక ఇండో పసిఫిక్ ప్రాంతంలో( Indo Pacific region ) యూఎస్‌తో తన భద్రతా లక్ష్యాలను పెంచుకోవడానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవడానికి ఈ చట్టం ఉద్దేశించింది.ఇండో అమెరికన్ నేతలు, డెమొక్రాటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, మార్క్( Raja Krishnamurthy, Ro Khanna, Mark ) వీసీలతో పాటు రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు ఆండీ బార్, మైక్ వాల్డ్జ్‌లతో కలిసి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు.

అమెరికా నుంచి భారతదేశానికి ఆయుధ విక్రయాలను వేగంగా ట్రాక్ చేయడానికి, ఇండో యూఎస్ రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి యాక్సెస్ చేసేలా చట్టాన్ని ప్రవేశపెట్టారు.

అమెరికా సెనేట్‌లో డెమొక్రాటిక్ సెనేటర్ వార్క్ వార్నర్( Democratic Senator Wark Warner ) , రిపబ్లికన్ సెనేటర్ జాన్ కార్నిర్ కూడా చట్టానికి మద్ధతు ప్రకటించారని రాజా కృష్ణమూర్తి( Raja Krishnamurthy ) కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.ఆయుధాల ఎగుమతి నియంత్రణ చట్టం కింద.ఫారిన్ మిలటరీ సేల్స్ (ఎఫ్ఎంఎస్), ఎగుమతుల సమీక్ష , విక్రయ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, వేగవంతం చేయడం ద్వారా అమెరికా భాగస్వాములు, మిత్రదేశాలతో భారత్ సమానంగా వుంటుందని బార్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) అమెరికా పర్యటన ముగించిన కొద్దిరోజులకే ఇండియా కాకస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.మోడీ పర్యటన సందర్భంగా భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక రక్షణ మైత్రి మరింత బలోపేతం దిశగా కీలక ముందడుగు పడిన సంగతి తెలిసిందే.యూఎస్ ఏరోస్పేస్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) , హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్ దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ మార్క్ 2 యుద్ధ విమానాల కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను హెచ్ఏఎల్‌తో కలిసి జీఈ ఉత్పత్తి చేయనుంది.ఈ ఒప్పందం ఫలితంగా జీఈ అభివృద్ధి చేసిన ఎఫ్ 414 -ఐఎన్ఎస్ 6 ఇంజిన్లను తేజస్ మార్క్ 2 యుద్ధ విమానాల్లో వినియోగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు