రెండు రోజుల్లో 2 కోట్లకు పైగానే.. 'మేమ్ ఫేమస్' కలెక్షన్స్!

Mem Famous Box Office Collection Day 2, Mem Famous, Mem Famous Collections, Sumanth Prabhas,Tollywood

మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా వరుసగా ప్రమోషన్స్ చేస్తూ ఆడియెన్స్ లో మంచి బజ్ నెలకొల్పిన చిత్రం ”మేమ్ ఫేమస్”.( Mem Famous )ఈ సినిమాను సుమంత్ ప్రభాస్ తెరకెక్కించారు.

 Mem Famous Box Office Collection Day 2, Mem Famous, Mem Famous Collections, Suma-TeluguStop.com

ఆయన డైరెక్షన్ లో అనేకమంది డెబ్యూ టాలెంటెడ్ యువతతో తెరకెక్కించిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందు భారీ అంచనాలు భారీగా పెరిగేలా చేసారు.

వరుస ప్రమోషన్స్ ఈ సినిమా ఓపెనింగ్స్ కు ప్లస్ అయ్యాయి అనే చెప్పాలి.అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) చేసిన కామెంట్స్ కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ కు బాగా కలిసి వచ్చాయనే చెప్పాలి.ఈయన పోస్ట్ తర్వాత ఈ సినిమా గురించి ఒక్కసారిగా మాట్లాడు కోవడంతో ఈ సినిమా మరింత ఫేమస్ అయ్యింది.

మే 26న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది.

అలాగే ప్రమోషన్స్ కూడా ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా చూసేలా చేస్తున్నారు.

అంతా కొత్తవారితో సుమంత్ ప్రభాస్ చేసిన ప్రయోగం కాస్త వర్కౌట్ అయ్యింది.సుమంత్ ప్రభాస్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది.ఈ సినిమాకు మొదటి రోజు 1.1 కోట్లు గ్రాస్( Mem Famous Collections ) వసూలు చేయగా రెండవ రోజు కూడా తగ్గలేదని తెలుస్తుంది.

మేమ్ ఫేమస్ సినిమా రెండవ రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ కనబర్చినట్టు తెలుస్తుంది.రెండవ రోజు కోతికి పైగానే గ్రాస్ రావడంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే 2.25 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేసినట్టు టాక్.చూడాలి ఈ వసూళ్లు వీకెండ్ తర్వాత ఎక్కడ ఆగుతాయో.

ఇక ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా చాయ్ బిస్కట్( Chai Bisket ) వారు నిర్మించారు.

Video : Mem Famous Box Office Collection Day 2, Mem Famous, Mem Famous Collections, Sumanth Prabhas #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube