పవన్ తో సినిమాపై స్పష్టత ఇచ్చిన మెగాస్టార్... వైరల్ అవుతున్న చిరు కామెంట్స్!.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.

చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఊహించని స్థాయిలో ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదని చెప్పాలి.ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ సినిమా అద్భుతమైన హిట్ కావడంతో చిత్ర బృందంతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఓ విలేఖరి పవన్ కళ్యాణ్ తో కలిసి మీరు ఎప్పుడు సినిమా చేస్తారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్ కు తనతో సినిమా చేయాలని కుతూహలం ఉంటుంది.

Advertisement
Megastar ,Pawan,clarified About The Movie,comments Are Going Viral , Clarified

నాకు కూడా పవన్ తో సినిమా చేయాలని ఉంది.సమయం వచ్చినప్పుడు మా ఇద్దరికీ సరైన కథ దొరికితే తప్పకుండా ఇద్దరం కలిసి సినిమాలో నటిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో సినిమాపై చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Megastar ,pawan,clarified About The Movie,comments Are Going Viral , Clarified

ఇక మెగా ఫాన్స్ సైతం వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.అయితే గాడ్ ఫాదర్ సినిమాలోని పవన్ కళ్యాణ్ నటించబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమాలో కుదరలేదు.త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని అభిమానులు సైతం ఎంతో ఆరాటపడుతున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి తనకు ఇతర భాషల నుంచి అవకాశాలు వచ్చిన నటించడానికి సిద్ధంగా ఉన్నానని సినిమాలను ఎప్పుడూ కూడా ప్రాంతీయ బేధంతో చూడకూడదని ఇండియన్ సినిమా అంటూ ఈ సందర్భంగా సినిమాల గురించి తెలిపారు.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు