' మెగా ' ఆశలు కాంగ్రెస్ కు లేనట్టే గా ? 

గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి వ్యవహారం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

జగన్ వద్దకు వెళ్లి వస్తున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను ప్రస్తావించి క్రమంలో అనేక మార్లు కలిశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారిని కలుస్తూ,  రాజకీయంగా రెండు అధికార పార్టీలతోనూ సన్నిహితంగా మెలుగుతున్నారు.అయితే చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు.

ఆయన ఆ పార్టీకి పూర్తిగా దూరం అవ్వలేక, దగ్గర కాలేక అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.అసలు చిరంజీవిపై కాంగ్రెస్ ఎప్పుడో ఆశలు వదిలేసుకుంది.

కాంగ్రెస్ కు సంబంధించి ఏ కార్యక్రమానికి పిలిచినా, చిరంజీవి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం తదితర కారణాలతో ఇక ఆయన పార్టీలో ఉన్న లేనట్టుగా భావిస్తూ వస్తున్నారు.అయితే గతంలో ఇదే విషయాన్ని కాంగ్రెస్ కీలకనేత ఉమెన్ చాందీ ప్రస్తావించారు.

Advertisement

చిరంజీవి కాంగ్రెస్ లేరంటూ ఆయన ప్రకటించగా , ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ఈ విషయాన్ని ఖండించారు.చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారని, ఉంటారని ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండడంతో యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ప్రకటించారు.

అయితే తాజాగా రెండు రోజుల క్రితం చిరంజీవి పుట్టినరోజు ఘనంగా జరిగింది.ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలను వివిధ రాజకీయ పార్టీల అధినేతలు, నాయకులు చెప్పారు.

కానీ కాంగ్రెస్ నేతలెవరూ చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పకపోవడం, స్వయంగా కలిసి అభినందనలు తెలుపకపోవటం ఇవన్నీ కాంగ్రెస్, చిరంజీవి మధ్య దూరం పెంచింది అనే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

ఇక చిరంజీవి కాంగ్రెస్ లో యాక్టీవ్ గా ఉండరు, పూర్తిగా ఆయన సినిమా వ్యవహారాల్లోనూ బజీగా ఉంటారనే విషయం అర్థం అయిపోయినా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చిరుని యాక్టివ్ చేయాలనే ఆకాంక్ష మాత్రం కనిపిస్తుంది.ఇక చిరంజీవి కూడా తాను కాంగ్రెస్ లో ఉన్నాను అని కానీ రాజీనామా చేయబోతున్నాను అని కానీ అసలు తన రాజకీయ అడుగులు ఏమిటనే విషయం లో ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో నే పార్టీ నాయకులు , జనాల్లో ను ఒకటే కన్ఫ్యూజన్ కనిపిస్తోంది.

ఢిల్లీలో కేటీఆర్ హరీష్ బిజి... కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చూపు
Advertisement

తాజా వార్తలు