Megastar Chiranjeevi : చిరు లీక్స్.. భోళా శంకర్ సినిమా నుంచి విజువల్స్ లీక్ చేసిన మెగాస్టార్.. ఫొటోస్ వైరల్?

దర్శకుడు మొహర్ రమేష్( Mehar Ramesh ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్( Bhola Shankar ).ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 Megastar Chiranjeevi Leaks Visuals Of A Song From Bhola Shankar Sets-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇందులో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.

అలాగే కీర్తి సురేష్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది.ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు 80% షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని పాటను చిత్రీకరించడానికి హైదరాబాద్‌ లో ఒక సెట్ వేశారు.

సంగీత్ సాంగ్ షూట్ చేస్తున్నారు.ఇందులో హీరోయిన్లు కీర్తి సురేష్, తమన్నాతో( Keerthy Suresh , Tamannaah ) పాటు హీరో సుశాంత్ సైతం పాల్గొన్నారు.శేఖర్ మాస్టర్( Shekhar ) కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్‌ను కలర్‌ఫుల్‌గా చిత్రీకరిస్తున్నారు.

అయితే ఈ మూవీ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు చిరు సర్‌ప్రైజ్ ఇచ్చారు.సాంగ్ షూట్‌కు సంబంధించిన విజువల్స్‌ను చిరు లీక్స్ పేరుతో వీడియో రూపంలో రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ వినేందుకు చాలా బాగుందని, అలాగే షూటింగ్ సెట్ కూడా బాగా కుదిరిందని వాయిస్ నోట్‌లో పేర్కొన్నారు చిరు.అంతేకాదు ఈ పాటలో దాదాపు సినిమాలోని ఆర్టిస్టులందరూ కనిపిస్తారని చెప్పారు.

ఇక ఈ సాంగ్ షూట్ చాలా హుషారుగా కొనసాగుతుండగా దీన్ని అభిమానులకు కూడా అందించాలనే ఉద్దేశ్యంతో కొన్ని విషయాలు లీక్ చేస్తున్నట్లు రివీల్ చేశారు చిరు.యూనిట్‌లోని కొన్ని విజువల్స్‌ను తీసుకుని, ఎడిట్ చేసి మీ కోసం ఇన్‌స్టాలో ప్రజెంట్ చేస్తున్నానంటూ వెల్లడించారు.అంతేకాదు ఈ చిరులీక్స్ గురించి ఎవరికీ చెప్పొద్దని సూచించిన మెగాస్టార్ మీరు మాత్రమే ఎంజాయ్ చేయండని తెలిపారు.ఇక చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో విషయానికొస్తే.

చిరంజీవితో తమన్నా, కీర్తి, సుశాంత్ స్టెప్పులేయడం కనిపించింది.చిరు అన్నట్లుగానే సెట్ గ్రాండియర్‌గా ఉండగా కీర్తి, తమన్నా సైతం గ్రాండ్ గా దర్శనమిచ్చారు.

అలాగే ఆర్టిస్టులు రఘుబాబు, హైపర్ ఆది, వైవా హర్ష, గెటప్ శ్రీను తదితరులు కూడా ఈ వీడియోలో కనిపించారు.కాగా ఇప్పటికే చిరు లీక్స్ ద్వారా చిరంజీవి తన సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు చిన్నచిన్న అప్డేట్లను విడుదల చేస్తూనే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube