మరింత ఆలస్యం అవుతున్న వరుణ్‌, లావణ్య పెళ్లి.. కారణం ఇదే!

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్( Varun tej ) తన ప్రియురాలు లావణ్య త్రిపాఠి( Lavanya tripathi ) ని వివాహం చేసుకునేందుకు మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సి వస్తుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ రెండవ వారం లో లేదా నాలుగవ వారం లో విదేశాల్లో వరుణ్ తేజ్ వివాహం జరగాల్సి ఉంది.

కానీ కుటుంబ పరిణామాలు మరియు కుటుంబ సభ్యుల పనుల కారణంగా వివాహాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.మొదట సెప్టెంబర్ లో అనుకున్నారు.

ఆ తర్వాత అక్టోబర్ కి పెళ్లి ని వాయిదా వేశారు.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం పెళ్లి ని నవంబర్ చివరి వారం లో లేదా డిసెంబర్లో నిర్వహించాలని మెగా కుటుంబ సభ్యులు( Mega family members ) నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా పెళ్లి కి హాజరయ్యే విధంగా డేట్లు ఖరారు చేయాల్సి ఉంది.అందుకే పదే పదే వాయిదా వేస్తున్నారు.

Advertisement

ఫ్యామిలీ కి చెందిన అందరూ కూడా విదేశాల్లో వరుణ్ వివాహానికి హాజరు అవ్వాల్సి ఉంది.అందుకే అందరికీ అన్ని విధాలుగా వీలుండే నెల ను, తేదీని కన్ఫర్మ్ చేయాలని భావిస్తున్నారు.

అందుకే సెప్టెంబర్.అక్టోబర్ నెలలను పక్కన పెట్టేశారు.

మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లా వివాహం కోసం వెయిట్ చేస్తున్నారు.వీరి వివాహ నిశ్చితార్థ వేడుక( Engagement ) ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.వీరి పెళ్లి కి సంబంధించి ఫోటోలు మరియు వీడియోలు కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హాజరవుతాడా.చిరంజీవి హాజరవుతాడా అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

నాలుగు రోజుల డెస్టినేషన్ వివాహము ను చేసుకోబోతున్నట్లు ఇటీవలే వరుణ్ తేజ్ ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు.ఇప్పటికే లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ ( Varun tej )పెళ్లి కి సంబంధించిన షాపింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.

Advertisement

కనుక పెళ్లి తేది అతి త్వరలోనే ఉంటుందని కొందరు నమ్మకం గా చెబుతున్నారు.వారి నుండి ప్రకటన వచ్చే వరకి ఏది క్లారిటీ లేదు.

తాజా వార్తలు