నోరు తిరగని పేరు పెట్టారనే వాళ్లకు మెగా ఫ్యాన్స్ సమాధానమిదే.. వాళ్ల ఇష్టమంటూ?

చరణ్ ఉపాసనల గారాల పట్టికి క్లీంకార కొణిదెల( Klin Kaara Konidela ) అనే పేరు ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ పేరు సోషల్ మీడియాలో క్లిన్ కార కొణిదెల అంటూ వైరల్ అవుతోంది.

అయితే మెగా ఫ్యామిలీ( Mega Family ) అంటే ఇండస్ట్రీలో కొంతమంది ఎప్పుడూ ద్వేషం కనబరుస్తూ ఉంటారు.మెగా ప్రిన్సెస్ కు సంబంధించిన వార్తల గురించి సైతం కొంతమంది అతి చేస్తూ కథనాలు వండి వార్చిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం మెగా ప్రిన్సెస్ కు నోరు తిరగని పేరు పెట్టారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అయితే నోరు తిరగని పేరు పెట్టారని కామెంట్లు చేసేవాళ్లకు మెగా ఫ్యాన్స్ సమాధానం ఇస్తున్నారు.

లలిత సహస్రనామం నుంచి ఆ పేరు తీసుకున్నారని ఆ పేరుకు మంచి అర్థం ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. క అనే అక్షరంతో పేరు పెట్టాలని పండితులు సూచించిన నేపథ్యంలో ఈ పేరును ఫిక్స్ చేశారని వాళ్లు వెల్లడిస్తున్నారు.

Advertisement
Mega Fans Shocking Counter To Negative Comments On Ram Charan Daughter Name Klin

కూతురికి ఎలాంటి పేరు పెట్టాలో చరణ్ ఉపాసనలకు( Ram Charan Upasana ) తెలుసని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Mega Fans Shocking Counter To Negative Comments On Ram Charan Daughter Name Klin

చిన్నారి పేరు గురించి సైతం ట్రోల్స్ చేయడం బాధాకరమని మెగా ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.పండితులు సైతం ఆ పేరు శక్తి స్వరూపమని మంచి పేరు పెట్టారని చెబుతున్నారు.కొంతమంది మెగా ఫ్యామిలీపై అసూయ, అక్కసు తగ్గించుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు చరణ్, ఉపాసన కూతురు పుట్టిన ఆనందంలో పూర్తిగా ఇంటికే పరిమితయ్యారని తెలుస్తోంది.

Mega Fans Shocking Counter To Negative Comments On Ram Charan Daughter Name Klin

మరికొన్ని వారాల పాటు చరణ్ షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారని సమాచారం.మెగా ప్రిన్సెస్ బారశాలకు సంబంధించి వైరల్ అయిన ఫోటోలలో చిరంజీవి లుక్ ఆకట్టుకునేలా ఉందని చిరంజీవి యంగ్ లుక్ లో కనిపించారని నెటిజన్లు చెబుతున్నారు.మెగా ప్రిన్సెస్ కు సంబంధించి వస్తున్న వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు