భర్తతో ఏ అవకాశాన్ని వదులుకోనంటున్న నిహారిక..?

గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో నిహారిక చైతన్యల పెళ్లి వేడుకకు సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అయ్యాయి.

మెగాబ్రదర్ నాగబాబు ఈ పెళ్లి వేడుక కోసం 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఖర్చు చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

లాక్ డౌన్ సమయంలో కరోనా నిబంధనలు ఉన్నా ఈ మధ్య కాలంలో ఏ సెలబ్రిటీ వివాహం జరగనంత గ్రాండ్ గా నిహారిక చైతన్యల వివాహం జరిగింది.తాజాగా సోషల్ మీడియా ద్వారా నిహారిక భర్త చైతన్యపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు.

చాలా సంవత్సరాల నుంచి నిహారిక చైతన్య ఒకరినొకరు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.నిహారిక తాను ప్రామిస్ చేస్తున్నానని లైఫ్ లో చైతన్యను నవ్వించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా తాను వదులుకోనని వెల్లడించారు.

అదే సమయంలో ఇలా కొట్టే అవకాశాన్ని కూడా వదులుకోనంటూ ఒక ఫోటోను షేర్ చేశారు.

Mega Daugheter Niharika Shares Pictures With Her Husband, Instagram Posts, Mega
Advertisement
Mega Daugheter Niharika Shares Pictures With Her Husband, Instagram Posts, Mega

పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు పెళ్లికి సంబంధించిన విశేషాలను పంచుకుంటున్న నిహారిక మరో పోస్ట్ లో తన కుటుంబాన్ని గర్వపడేలా చేస్తానని అన్నారు.నిహారిక చైతన్యల జోడీ బాగుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నిహారిక చైతన్యల జంట చిలుకాగోరింకల్లా చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ లో వైభవంగా జరిగిన పెళ్లి వేడుకకు నాగబాబు సొంత డబ్బులతో జరిపించారని.హైదరాబాద్ లో రిసెప్షన్ మాత్రం పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు జరిపించారని తెలుస్తోంది.భవిష్యత్తులో మరికొంత మంది సెలబ్రిటీలు తమ వివాహాలను ఉదయ్ విలాస్ లో జరుపుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.2021లో యంగ్ హీరో వరుణ్ తేజ్ పెళ్లి జరిగే అవకాశం ఉందని ఇండాస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు