సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి అడుగు పెట్టినప్పుడు మీనాక్షి చౌదరిని( Meenakshi Chaudhary ) ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా కూడా ఆమెకి రావాల్సినంత గుర్తింపు దక్కలేదు.
అయితే ఇప్పుడు మాత్రం మీనాక్షి చౌదరికి రేంజ్ మరో రేంజ్ కి వెళ్ళిపోయింది.ప్రస్తుతం ఆమె విశ్వక్ సేన్( Vishwak Sen ) నుంచి విజయ్ వరకు అందరితోనూ నటిస్తూ సౌత్ ఇండియాలోనే తన లాంటి హీరోయిన్ మరొకరు లేరు అని నిరూపిస్తోంది.
పైగా టాలీవుడ్ నెంబర్వన్ హీరోని స్థాయికి దూసుకెళ్తోంది చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తూ అతి త్వరలోనే ఆ స్థాయిని చేరుకోవడానికి తహతహలాడుతోంది.

మొట్టమొదటిసారి సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనములు నిలపరాదు( Ichata Vahanamulu Nilaparadu movie ) అనే సినిమా ద్వారా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా పరాజయం పాలైంది ఆ తర్వాత రవితేజ( Ravi Teja ) సరసన ఖిలాడి చిత్రంలో కూడా నటించింది.ఇది కూడా దాదాపు పెద్ద ఫ్లాప్ దాంతో ఈ అమ్మడును ఎవరు అంతగా పట్టించుకోలేదు.
ఇక ఖచ్చితంగా మూడోసారి అడవి శేషు సరసన హిట్ 2( Hit 2 ) చిత్రంలో నటించింది.ఈ సినిమా విజయం సాధించిన అది పూర్తిగా అడవి శేషు( Adavi seshu ) ఖాతాలోకి వెళ్ళిపోయింది.
గ్లామర్ షో కి ఎలాంటి అడ్డంకులు లేని మీనాక్షి చౌదరి ఎందుకో మీడియాలో సెన్సేషన్ అవ్వలేదు అలాగే జనాల్లో కూడా అంతగా వైరల్ అవ్వలేదు.

ఇక మహేష్ బాబు ( Mahesh Babu )గుంటూరు కారం చిత్రంలో సెకండ్ లీడ్ గా నటించింది.పూజ హెగ్డే తప్పుకోవడంతో సెకండ్ లీడ్ పాత్రలో ఉన్న శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాక ఆ పాత్రలో మీనాక్షి చౌదరి వచ్చి చేరింది ఈ సినిమాలో కూడా పెద్దగా ఆమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.కానీ ఇక్కడి నుంచి ఆమె దశ తిరిగింది అనుకోవచ్చు.
ఇప్పుడు ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తోంది.విశ్వక్సేన్ తదుపరి చిత్రం మెకానిక్ రాఖీ చిత్రంలో కూడా మీనాక్షిని హీరోయిన్ గా తీసుకున్నారు.
ఇక వరుణ్ తేజ్ మొట్టమొదటి ప్యాన్ ఇండియా చిత్రమైన మట్కలో కూడా ఈ అమ్మడే హీరోయిన్ గా ఉంది.తమిళ్ లో కూడా విజయ్ సరసన ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ లో నటిస్తుంది దీంతో సౌత్ లో గట్టిగానే పాగా వేసింది.