Ginger Crop : అల్లం పంటను వేరు పురుగుల బెడద నుండి సంరక్షించే చర్యలు..!

అల్లం పంటను( Ginger Crop ) సాగు చేయాలంటే ముందు సాగు విధానంపై అవగాహన కల్పించుకోవాలి.

ఎందుకంటే అల్లం పంటకు తెగుళ్ల, చీడపీడల బెడద చాలా ఎక్కువ.

కాబట్టి అల్లం పంటకు ఏ సమయాలలో ఎలాంటి చీడపీడలు లేదంటే ఎలాంటి తెగులు( Pests ) ఆశిస్తాయో అవగాహన ఉంటే సకాలంలో గుర్తించి తొలి దశలోనే వాటిని అరికట్టి పంటను సంరక్షించుకోవాలి.అల్లం పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే వేరు పురుగులు కీలకపాత్ర పోషిస్తాయి.

ఈ వేరు పురుగులు అల్లం మొక్క కాండంపై గుడ్లు పెడతాయి.ఈ గుడ్ల లోపల నుంచి సీ ఆకారంలో తెల్లని పురుగులు బయటకు వస్తాయి.

ఈ పురుగులు దుంపలను, వేర్లను, మొక్కల మొదళ్లను ఆశిస్తాయి.ఈ పురుగులు ఆశించిన దుంపల మీద పెద్ద పెద్ద రంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి.

Measures To Protect The Ginger Crop From Root Insects
Advertisement
Measures To Protect The Ginger Crop From Root Insects-Ginger Crop : అల్�

కాబట్టి ఈ వేరు పురుగులను అల్లం మొక్కలపై( Ginger Plant ) గుర్తించిన వెంటనే వీటిని పూర్తిగా అరికట్టే ప్రయత్నం చేయాలి.ఈ పురుగులను పూర్తిస్థాయిలో అరికట్టాలంటే ఒక ఎకరం పొలానికి ఐదు కిలోల ఫోరెట్ లేదంటే 7 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలు వేయాలి.అల్లం పంటకు ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశిస్తే వాటి వ్యాప్తి ఉధృతంగా ఉండకూడదంటే మొక్కల మధ్య కాస్త అధిక దూరం ఉండాలి.

Measures To Protect The Ginger Crop From Root Insects

మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలితే తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉండదు.ఇక కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.నేలలోని తేమశాతాన్ని బట్టి పంటకు నీటి తడులు అందించాలి.

పంట సాగు చేయడానికి ముందు సాగు విధానంపై అవగాహన ఉంటే పెట్టుబడి వ్యయంతో పాటు శ్రమ కూడా తగ్గుతుంది.అప్పుడే పంటను సంరక్షించుకుని అధిక దిగుబడి సాధించవచ్చు.

నాని హిట్3 సినిమాలో మరో స్టార్ హీరో కనిపించనున్నారా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు