Turmeric crop : పసుపు పంటకు తీవ్ర నష్టం కలిగించే తాటాకు తెగుళ్ల నివారణకు చర్యలు..!

పసుపు పంటకు( turmeric crop ) మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండే ఉంటుంది కానీ చీడపీడల, తెగుళ్ల బెడద( pets ) కాస్త ఎక్కువగా ఉండటం వల్ల రైతులు పసుపు పంట సాగు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.

అయితే పసుపు పంట సాగు విధానంపై పూర్తి అవగాహన కల్పించుకుంటే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

పసుపు పంట సాగు విధానం అవగాహన లేని రైతులు పసుపు పంట సాగు చేయాలనుకుంటే గుర్తుంచుకోవలసిన యాజమాన్య పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం.

వేసవికాలంలో నేలను లోతు దుక్కులు దున్నుకోవాలి.ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలు ఏవైనా ఉంటే పూర్తిగా తొలగించాలి.నేలను లోతుగా దున్నడం వల్ల నేల వదులుగా మారి పసుపు గడ్డ ఊరడానికి అనువుగా ఉంటుంది.

పసుపు పంటలో అత్యంత కీలకము విత్తన శుద్ధి( Seed treatment ).విత్తన శుద్ధి చేయకపోతే నేల నుంచి వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించే అవకాశం ఉంటుంది.రెండు మిల్లీ మీటర్ల డైమితోయేట్( Dimitoate ) ను ఒక లీటరు నీటిలో కలిపి ఆ ద్రావణంలో 30 నిమిషాల పాటు పసుపు దుంపలను ముంచి ఆ తర్వాత విత్తుకోవాలి.

Advertisement

ఎరువుల విషయానికి వస్తే.సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఒక ఎకరానికి 15 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.ఒకవేళ పశువుల ఎరువు వేయకపోతే ఒక ఎకరానికి 200 కిలోల వేప పిండి మరియు కానుగ పిండి( Kanuga flour ) ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

పసుపు పంటకు తాటాకు తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.సకాలంలో గుర్తించి తొలి దశలో అరికట్టకపోతే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సిందే.వర్షాలు ఏకధాటిగా కురిసినప్పుడు, ఈదురు గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండి ,సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు ఈ తెగుళ్లు పంటను ఆశిస్తాయి.

పసుపు మొక్కల ఆకుపై ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి, అవి క్రమంగా పెరిగి చివరికి ఆకు ఎండిపోయిన చేస్తాయి.ఈ తెగుళ్లను పంట పొలంలో గుర్తించిన తర్వాత ఒక లీటరు నీటిలో రెండు మిల్లీలీటర్ల హెక్సకొనజోల్ 5% SC ను కలిపి పిచికారి చేయాలి.

4 సెకన్లకు కోటి రూపాయలు.. స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ ఇంతకు మించి సాక్ష్యం కావాలా?
Advertisement

తాజా వార్తలు