ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్ధిపై దాడి... తీవ్రంగా స్పందించిన ఇండియా, చర్యలకు డిమాండ్

ఆస్ట్రేలియాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్ధిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం బాధితుడు శుభమ్ గార్గ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

 Mea Requests Australia To Take Action Against Those Involved In Indian Student S-TeluguStop.com

మరోవైపు ఈ ఘటను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందామ్ బాగ్చి స్పందించారు.

భారత విద్యార్ధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని… ఆస్ట్రేలియాలోని భారత హైకమీషన్, కాన్సులేట్ అధికారులు అన్ని రకాలుగా అండగా నిలిచారని ఆయన తెలిపారు.అలాగే ఈ దాడికి కారణమైన నేరస్థుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది.

అటు … ఈ దాడికి పాల్పడిన 27 ఏళ్ల డానియెల్ నార్‌వుడ్ అనే వ్యక్తిని న్యూసౌత్‌వేల్స్ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన శుభమ్ గార్గ్.ఐఐటీ మద్రాసులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

ఈ క్రమంలో ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లాడు.ఈ నేపథ్యంలో అక్టోబర్ 6వ తేదీ రాత్రి 10.30 గంటలకు రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న శుభమ్‌ను ఆగంతకుడు అడ్డగించాడు.డబ్బులు లేవని, లేదంటే చంపేస్తానని బెదిరించాడు.

దీనికి శుభమ్ తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దుండగుడు అతనిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు.ఈ ఘటనలో శుభమ్ ముఖం, ఛాతి, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి.

రక్తపు మడుగులో పడివున్న బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Telugu Iit Madras, Meaaustralia, Shubham-Telugu NRI

రెండు రోజుల తర్వాత శుభమ్ తల్లిదండ్రులకు ఈ దాడి గురించి తెలియడంతో వారు తమ కుమారుడికి సాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.అతని తల్లిదండ్రులకు వీసా మంజూరవ్వగానే వారు ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లనున్నారు.ప్రస్తుతం శుభమ్ ఆరోగ్యం విషమంగానే వుందని అతని సోదరి చెప్పారు.

వైద్యులు అతని ప్రాణాలను కాపాడేందుకు గాను పలు సర్జరీలు చేసినట్లుగా సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube