మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పదేమో

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం దాటింది.బీజేపీ మరియు శివసేన కలిసి పోటీ చేసి ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్లను దక్కించుకున్నాయి.

అయితే ఈ రెండు పార్టీల మద్య ఇప్పుడు అధికారం కోసం ఆధిపత్యం సాగుతోంది.పెద్ద ఎత్తున ఈ విషయమై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

May Be President Rule Come In Maharastra-మహారాష్ట్రలో �

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రలో సొంతంగానే ప్రభుత్వంను ఏర్పాటు చేయాలి.శివసేనకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పింది.

ఇదే సమయంలో శివసేన మాత్రం తాము లేకుండ ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు.కనుక మాకు సీఎం పీఠంలో సగం రోజులు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక సామ దాన దండోపాయాలను చేసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, పడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది.అందుకోసం శివసేన పార్టీ మద్దతుకు ఒప్పుకోకుంటే రాష్ట్రపతి పాలన పెట్టే విషయమై ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

బీజేపీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు మహారాష్ట్రలో పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే రాష్ట్రపతి పాలన ప్రారంభం అయ్యే అవకాశం ఉందని, కేంద్రం ఈ రాష్ట్రంలోని అధికారాలను స్వాదీనం చేసుకుంటుందనే చర్చలు కూడా జరుగుతున్నాయి.మొత్తానికి ఈ ప్రకటనతో శివసేన ఆలోచనల్లో పడుతుందా చూడాలి.

Advertisement

తాజా వార్తలు