Mattikusti movie Review : మట్టికుస్తీ రివ్యూ: రొటీన్ స్టోరీ.. కానీ కామెడీ మాత్రం సూపర్!

చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందిన సినిమా మట్టి కుస్తీఈ సినిమాలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, శ్రీజా రవి, అజయ్, శత్రు, మునీష్ కాంత్, కాళీ వెంకట్, రిడిన్ కింగ్ స్లే, హరీష్ పేరడీ తదితరులు నటించారు.

ఇక ఈ సినిమాకు రవితేజ, విష్ణు విశాల్ నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.

రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.జస్టిస్ ప్రభాకర్ సంగీతాన్ని అందించాడు.

అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.ఇందులో విష్ణు విశాల్ వీరా అనే పాత్రలో కనిపిస్తాడు.

ఇక ఇతడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి.ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు వీరా.

Advertisement

అయితే వీరా తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో తన మామయ్య (కరుణాస్) దగ్గర పెరిగాడు.అయితే వీరా తండ్రి, తాతలు సంపాదించిన ఆస్తిని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేస్తూ జల్సాగా తిరిగేవాడు.

అంతేకాకుండా చిన్న చిన్న పంచాయతీలను కూడా చేస్తూ ఉంటాడు.ఫ్రెండ్స్ తో బాగా కబడ్డీ ఆడుతూ ఉంటాడు.

అయితే వీరాకు ఒక కోరిక ఉంది.తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనకంటే తక్కువగా చదువుకొని ఉండాలి అని.ఆమెకు పొడుగు జుట్టు ఉండాలని కోరిక ఉంటుంది.ఇదంతా ఇలా ఉంటే హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కీర్తి పాత్రలో కనిపిస్తుంది.

ఇక ఈమె కేరళలోని జన్మించింది.ఈమె బిఎస్సి వరకు చదువుకుంటుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఇక ఈమె ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకున్నా కూడా తన బాబాయ్ (మనీష్ కాంత్) సపోర్టుతో రెజ్లర్ గా మారుతుంది.అబ్బాయి లాగా కటింగ్ చేసుకొని తిను పట్టే అమ్మాయిగా కనిపిస్తే ఎవరి పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అని కీర్తి వాళ్ళ ఆమె చదువుకోలేదు అంటూ పొడుగు జుట్టు ఉంది అబద్ధాలు చెప్పి వీరా తో పెళ్లి చేపిస్తాడు.

Advertisement

అయితే ఓసారి వీరా అను కొందరు వ్యక్తులు కొడుతూ ఉండగా వెంటనే కీర్తి తన భర్తను కాపాడుకోవడానికి వాళ్లను బాగా చితక్కొడుతుంది.ఆ తర్వాత వీరి దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి.

ఇంతకు ఆ సమస్యలు ఏంటి.చివరికి వీరాకు కీర్తి గురించి అసలు నిజం తెలుస్తుందా లేదా అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

నటీనటుల విషయానికి వస్తే విష్ణు విశాల్ తన పాత్రతో బాగానే ఆకట్టుకున్నాడు.ఇక ఐశ్వర్య లక్ష్మి మాత్రం తన పాత్రతో అద్భుతంగా మెప్పించింది.రెండు కోణాల్లో తనేంటో నిరూపించింది.

ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్:

డైరెక్టర్ ఈ సినిమా కథను భార్య భర్త నేపథ్యంలో తీసుకొచ్చాడు.ఇక దీనిని ఒక స్పోర్ట్స్ డ్రామాగా చూపించాడు.

పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.తెలుగులో డబ్బింగ్ విషయంలో జాగ్రత్త పడితే బాగుండేది.

సినిమాటోగ్రఫీ పర్వాలేదు.మిగిలిన నిర్మాణం విలువలు సినిమా తగ్గట్టు పనిచేశాయి.

విశ్లేషణ:

ఈ సినిమా చూస్తూనంతసేపు కథ ఊహించినట్లుగా ఉంటుంది.ముఖ్యంగా తమిళ సినిమా కాబట్టి డబ్బింగ్ విషయంలో తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.కానీ కథ మాత్రం పరవాలేదు.

భార్యాభర్త మధ్య ఉండే పోటీత్వాన్ని బాగా చూపించాడు దర్శకుడు.

ప్లస్ పాయింట్స్:

సినిమా కథ, నటీనటుల నటన, ఎంటర్టైన్మెంట్, కామెడీ.

మైనస్ పాయింట్స్:

తెలుగు డబ్బింగ్ లో కాస్త జాగ్రత్త పడితే బాగుండేది.అక్కడక్కడ రొటీన్ గా అనిపించింది.

మ్యూజిక్ ఆకట్టుకోలేకపోయింది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఇది ఒక భార్య భర్తల మధ్య సాగిన కథ.కామెడీ పరంగా ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 2.75/5

తాజా వార్తలు