అనాధల రక్షణగా మాతృదేవోభవ ఆశ్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా:కన్న తల్లిదండ్రులనే ఇంటి నుండి బయటికి నెట్టేస్తున్న కాలంలో ఎవరో తెలియని అనాధలను అక్కున చేర్చుకొని,వారి కోసం ఓ ఆశ్రయం స్థాపించి,మంచి చెడులు చూస్తూ,ఎవరైనా చనిపోతే కన్న కొడుకులా వారికి అంత్యక్రియలు చేస్తూ అనాథల పాలిట రక్షకుడిగా మారారు యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన గట్టు గిరి.రంగారెడ్డి జిల్లా,బాలాపూర్ మండలం నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ పాఠశాల ఆవరణలో ఒక్కరితో మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని ప్రారంభించి, మానసిక రుగ్మతలకు లోనై పిచ్చోడిలా గడ్డాలు పెంచుకొని రోడ్లమీద తిరుగుతున్న వారిని చేరదీసి,వారికి స్నానాలు చేపించి,తల వెంట్రుకలను కట్ చేసి మామూలు మనుషుల్లా రెడీ చేసి,ఆశ్రమంలోనే వైద్యం అందిస్తూ,తర్వాత ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చికిత్స అందించి,మామూలు స్ధితికి వచ్చాక కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని అప్పగిస్తున్నారు.

 Matrudevobhava Anadha Ashramam For Protection Of Orphans, Yadadri Bhuvanagiri,-TeluguStop.com

ఈ ఆశ్రమాన్ని 2018 లో ఒక భవనం అద్దెకు తీసుకొని ఒక్కరితో ప్రారంభించి,ఈ రోజు 120 మందిని అనాథలకు సేవలు చేస్తున్నారు.

ఇలా ఆశ్రమంలోనే ఉంటూ పరిస్థితి విషమించి మరణించిన వారికి నిర్వాకులు సంప్రదాయ బద్దంగా కన్న కొడుకులా తలకొరివి పెట్టి వారి ఆత్మకు శాంతి కలగాలని అంతక్రియలు నిర్వహిస్తారు.

దాదాపుగా 50 మందికి అనాధ శవాలకు ఇలా చేయడం గమనార్హం.మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని అక్షరాల నిజం చేస్తున్న వీరి కృషి అభినందనీయం.

ఈ ఆశ్రమ సేవను గుర్తించి ఎన్నో అవార్డులు ఇచ్చినా,గత ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం అందక 6 ఏళ్ల నుండి అద్దె భవనంలోనే ఆశ్రమం నడిపిస్తున్నారు.గత ప్రభుత్వ అధికారుల కనీస స్పందన కూడా కరువవడంతో మెరుగైన సేవలు అందించలేక పోయామని నిర్వాహకులు వాపోయారు.

మా అన్నయ్య మరణం నన్ను కలచి వేసిందని,మా అన్నయ్య గతంలో మతిస్థిమితం కోల్పోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించాడు.మా కుటుంబం లాగా ఇంకోకరి కుటుంబం కావొద్దనే ఉద్దేశ్యంతో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశానని ఆశ్రమ నిర్వాహకులు గట్టు గిరి అన్నారు.

నా సొంత ఊరు సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) ఆ ఊరిలో పుట్టడం నేను చేసుకున్న పుణ్యం.నాకు సిమెంట్ ఇటుకల వ్యాపారం ఉంది.అందులో నుండి వచ్చే ఆదాయాన్ని కొంత వరకు అశ్రమానికి ఉపయోగిస్తాను.కొందరు జయంతి,వర్దంతి కార్యక్రమాలకు నిత్యావసర సరుకులు అందిస్తూ ఉంటారు.

మేము చేస్తున్న సేవలకు ప్రభుత్వం గుర్తించి రెండు ఎకరాలు కేటాయిస్తే వికలాంగులను చేరదీసి వారికి కొత్త జీవితాలు ప్రసాదించవచ్చని మా మాతృదేవోభవ ఆశ్రమం తరుపున కోరుతున్నాను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube