ఆగస్ట్ 2న ‘మసూద’ టీజర్

మ‌ళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో రాబోతోన్న మూడో చిత్రం ‘మ‌సూద‌’.కంటెంట్ రిచ్ ఫిల్మ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

 'masuda' Teaser On 2nd August Sangeeta, Thiruveer, 'masuda, Teaser, Tollywood, K-TeluguStop.com

ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ ట్రైమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.ఇప్పుడు చిత్ర టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఆగస్ట్ 2న ఈ చిత్ర టీజర్‌ విడుదల కాబోతోంది.తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్ కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.

హర్రర్ డ్రామా జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో ప్రామిసింగ్ డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ (ల‌ల్లన్ సింగ్ పాత్రధారి) న‌టిస్తుండగా.

‘గంగోత్రి’ చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిల రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాశ్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణ తేజ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి

ఆర్ట్: క్రాంతి ప్రియం,కెమెరా: నగేష్ బనెల్,స్టంట్స్: రామ్ కిషన్ అండ్ స్టంట్ జాషువా,సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, ఎడిటింగ్: జెశ్విన్ ప్రభు,పీఆర్వో: బి.వీరబాబు,నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా,రచన, దర్శకత్వం: సాయికిరణ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube