ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లను హీరో రాజ్ తరుణ్( Raj Tarun ) పేరు కూడా ఒకటి.
గత రెండు మూడు రోజులుగా హీరో రాజ్ తరుణ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.
రాజ్ తరుణ్, ఆయన భార్య లావణ్య ల( Lavanya ) పేర్లు ఒక రేంజ్ లో వినిపిస్తున్నాయి.అయితే గత రెండు మూడు రోజులుగా వివాదం కొనసాగుతూనే ఉంది.
ఈ వివాదంలోకి తాజాగా మస్తాన్( Mastan ) ఎంటర్ అయ్యారు.తన భార్య లావణ్య కు మస్తాన్ కి సంబంధం ఉందని ఆరోపించాడు హీరో రాజ్ తరుణ్.
ఈ మేరకు ఈ విషయంపై మస్తాన్ ఈ విషయంపై స్పందించారు.
తనకు, లావణ్యకు మధ్య ఉన్న బంధాన్ని రాజ్ తరుణ్ తప్పుగా అర్థం చేసుకున్నాడని అన్నాడు.ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ.లావణ్యతో నేను క్లోజ్ గానే ఉంటాను.
ఆ విషయం రాజ్ తరుణ్ కు కూడా తెలుసు.కానీ అతడు ఆరోపిస్తున్నట్టు నేను లావణ్యతో లివ్ ఇన్ లో లేను.
రాజ్ తరుణ్ కింద రూమ్ లో ఉంటే, పైన గదిలో నేను, లావణ్య తలుపులేసుకొని ఉన్నామనే ఆరోపణ తప్పు.లావణ్యను ఎప్పుడూ రాజ్ తరుణ్ నుంచి విడదీయాలని నేను అనుకోలేదు.
మేమిద్దరమే రూమ్ లోకి వెళ్లి తలుపులేసుకున్న సందర్భాల్లేవ్.క్యాజువల్ గా కూర్చొని మాట్లాడుకుంటాము.
తనపై లావణ్యపై డ్రగ్స్ కేసు( Drugs Case ) పడిన తర్వాత ఆ కేసుపై చర్చించేందుకు తను ఎక్కువగా లావణ్య ఇంటికి వెళ్లానని, ఈ 2 నెలల్లో ఒక 15 సార్లు వెళ్లి ఉంటానని, ఆ మాత్రం దానికే రాజ్ తరుణ్ అపార్థం చేసుకున్నాడని అంటున్నాడు మస్తాన్.అటు లావణ్య కూడా ఇదే మాట చెబుతోంది.మస్తాన్ తో తనకు అక్రమ సంబంధం లేదని, తను రాజ్ తరుణ్ తో మాత్రమే సహజీవనం చేస్తున్నానని, తనకు న్యాయం చేయాలని కోరుతోంది.
మరి ఈ విషయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.అలాగే మస్తాన్ మాటలపై రాజ్ తరుణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా చూడాలి మరి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy