హైదరాబాద్ లో భారీ చోరీ కేసు ఛేదన.. నిందితుల ముఠా అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని రాంగోపాల్ పేట పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న భారీ చోరీ కేసును ఛేదించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.ఇంటిలో పని మనుషులుగా చేరి రూ.

5 కోట్ల విలువైన బంగారం, వెండిని అపహరించుకుని వెళ్లారు.ఈ కేసులో ప్రధాన నిందితుడుగా కమల్ అనే వ్యక్తి ఉన్నాడని సీపీ పేర్కొన్నారు.

ఈ క్రమంలో చోరీకి పాల్పడిన పది మందితో కూడిన నేపాలీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.అనంతరం నిందితుల నుంచి రూ.41 లక్షల నగదు, 2.8 కేజీల బంగారం మరియు 18 వాచ్ లను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.గత ఐదేళ్లుగా నమ్మకస్తులుగా పని చేస్తూ సింథి కాలనీలోని వ్యాపారి ఇంటిలో ఈ భారీ చోరీకి పాల్పడ్డారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

అదేవిధంగా ముఠాలోని మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!

తాజా వార్తలు