బట్టల షాపులో దాక్కున్న భారీ కొండచిలువ.. ప్యాంటు కొనడానికి వచ్చిన కస్టమర్‌కు షాక్..

ప్రస్తుతం భారతదేశంలో శీతాకాలం నడుస్తోంది.ఈ కాలంలో ఊహించని రీతిలో వర్షాలు ( Rains ) కురుస్తూ జీవరాశులను వెచ్చని ప్రదేశాలకు వెళ్లేలా బలవంతం చేస్తున్నాయి.

ముఖ్యంగా పాములు( Snakes ) ఎక్కడ వెచ్చదనం ఉంటే అక్కడి ప్రదేశాలకు తరలిపోతున్నాయి.ఇవి ఎప్పుడు, ఎక్కడ ప్రత్యక్షమవుతాయో ఊహించడం చాలా కష్టం కాబట్టి ఏదైనా ప్రాంతంలోకి వెళ్లే ముందు కర్రతో చెక్ చేసుకుని జాగ్రత్త పడటం మంచిది.

ఇళ్లలోనే కాదు షాపులలో కూడా పాములు చొరబడే అవకాశం ఉంది.తాజాగా జరిగిన ఒక ఘటన ఈ విషయాన్ని నిరూపిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం,( Uttar Pradesh ) మీరట్‌ సిటీలోని ఓ బట్టల దుకాణంలోకి( Textile Shop ) పెద్ద కొండచిలువ దూరింది.దీనిని చూసే కస్టమర్లకు గుండెలు అదిరిపోయాయి.ఈ పాము ఏకంగా 14 అడుగులు పొడవు, 18 కిలోల బరువు ఉంది.

Advertisement

పైథాన్‌ను( Python ) గుర్తించిన వెంటనే దుకాణం యజమాని అటవీ శాఖకు సమాచారం అందించాడు.వారు హుటాహుటిన షాపుకు చేరుకొని అత్యంత సురక్షితంగా దానిని పట్టుకోగలిగారు.

ఆపై అడవిలో వదిలేశారు.

ప్యాంటు కొనడానికి వచ్చిన కస్టమర్‌ ఈ పామును గుర్తించాడు.అంత పెద్ద పామును అక్కడ ఊహించని ఆ వ్యక్తి చాలా షాక్ అయ్యాడు.ఆ షార్ట్ నుంచి తీరుకొని దుకాణ సిబ్బందికి తెలియచేశాడు.

ఈ విషయం అందరికీ త్వరగానే తెలియడంతో వారు బట్టల షాపు నుంచి బయటకు పరుగులు తీశారు.చివరికి ఎలాంటి అపాయం లేకుండా ఈ పామును బయటికి పంపించగలిగారు.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
చూపు లేకపోయినా 4 కిలోమీటర్లు నడిచి గ్రూప్4 జాబ్.. మానస సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసి చాలామంది "వామ్మో ఎంత పెద్ద పామో దాని నేరుగా చూసిన వారికి కాళ్లు వణికిపోయి ఉంటాయి" అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

దీనిని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు