దేవుడి ప్రసాదం తయారీలో భారీ అవినీతి.. ఇంకా శ్రీశైల దేవస్థానంలో..

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి భగవంతునికి పూజ చేసి దర్శించుకునే వెళుతూ ఉంటారు.

ఇలా ప్రతి రోజు వచ్చే భక్తుల కోసం తయారు చేసే ప్రసాదం విషయంలోనే కొంత మంది అవినీతికి పాల్పడితే ఇక సాధారణమైన మనిషికి భగవంతుడు ఉన్నాడు.

పైనుంచి అంతా చూస్తాడు అనే పాప బీతి ఎలా ఉంటుంది.కానీ ప్రస్తుత జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అటువంటి భయాలు ఎవరికీ లేవు అని అర్థం అవుతోంది.

తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో భారీ అవినీతి బాగోతం బయటపడింది. లడ్డూర తయారీ సరుకు కొనుగోళ్లలో లక్షలాది రూపాయలు అవకతవకలు జరిగాయని సమాచారం.

లడ్డు తయారీ సరుకు రేట్లలో దాదాపు 42 లక్షలు అవకతవకలు అయ్యాయని దేవాలయ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి వెల్లడించారు.

Massive Corruption In The Preparation Of Gods Prasadam ,massive Corruption ,prep
Advertisement
Massive Corruption In The Preparation Of Gods Prasadam ,Massive Corruption ,prep

లడ్డు తయారీకి కాంట్రాక్టర్ సెకండ్ క్వాలిటీ సరుకులు సరఫరా చేస్తున్నారని వెల్లడించారు.అంతేకాకుండా మార్కెట్ రేటు కంటే అధిక ధరకు సరుకులు సరఫరా చేస్తున్నారని వెల్లడించారు.తమ అంతర్గత విచారణలో ఈ విషయం తెలిసిందని చైర్మన్ పేర్కొన్నారు.

ఈ విషయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.లడ్డు తయారీకి సరుకులు ఇస్తున్న కాంట్రాక్టర్ ను రద్దు చేసేందుకు గత నెలలో జరిగిన ట్రస్ట్ బోర్డు మీటింగ్లో బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారని కూడా వెల్లడించారు.

Massive Corruption In The Preparation Of Gods Prasadam ,massive Corruption ,prep

అయితే ఇంత వరకు కాంట్రాక్టర్ రద్దుకు సంబంధించి దేవాలయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు రాలేదని అందుకే కాంట్రాక్టర్ రద్దు చేయలేదని కూడా వెల్లడించారు.దేవాలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని రానున్న ఫిబ్రవరి, మార్చి నెలలను కూడా కలుపుకుంటే కనీసం కోటి తేడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025
Advertisement

తాజా వార్తలు