సమ్మర్ వస్తే చాలు మన టాలీవుడ్ స్టార్స్ అంతా ఫ్యామిలీతో పాటు సమయం గడపడానికి ఇష్ట పడతారు.ఈ క్రమంలోనే వెకేషన్ లలో విహరిస్తూ ఉంటారు.
సమ్మర్ లో మన దేశం లోని వేడిని తట్టుకోలేక కూల్ గా ఉంటే కంట్రీల్లో సేదదీరేందుకు ఇష్ట పడుతుంటారు.ఈ క్రమంలోనే సమ్మర్ వస్తే చాలా మంది తమ ఫ్యామిలీతో పాటు విదేశాలకు వెకేషన్ కోసం వెళ్తారు.
తాజాగా మాస్ రాజా రవితేజ కూడా ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తుంది.సమ్మర్ ముగిసే లాస్ట్ మూమెంట్ లో రవితేజ ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేసారు.తాజాగా ఈయన ఫ్యామిలీతో కలిసి యూరప్ వెకేషన్ ( Mass Raja Family Trip ) కోసం వెళ్లారు.భార్య, పిల్లలతో ఒక వారం రోజుల పాటు అక్కడ ఎంజాయ్ చేసి ఆ తర్వాత షూట్ లో జాయిన్ అవుతారు అని తెలుస్తుంది.
ప్రస్తుతం రవితేజ కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియన్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీ టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswara Rao ) అనే టైటిల్ తో తెరకెక్కుతుంది.డైరెక్టర్ వంశీ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను నిర్మాతలు నిర్మిస్తున్నారు.
మరి ఈ సినిమా నుండి అతి త్వరలోనే రవితేజ( Ravi Teja ) ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే సాలిడ్ అప్డేట్ రాబోతుంది.ఇందుకు భారీ సన్నాహాలు కూడా చేస్తున్నారు.ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వాయిస్ ఓవర్ కూడా ఐదు స్టార్ హీరోలతో ప్లాన్ చేసారు.ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా.
అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.