మాస్ మహారాజా రవితేజ( Raviteja ) స్పీడ్ మరే హీరోకు కూడా ఉండదు.ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంటాడు.
రవితేజకు క్రాక్, ధమాకా వంటి హిట్స్ పడడంతో మళ్ళీ జోష్ పెరిగింది.దీంతో ఇంతకు ముందుగా ఈయన స్పీడ్ పెరిగింది.
ఇక ఇటీవలే రవితేజ వంశీ దర్శకత్వంలో చేసిన టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswar Rao ) దసరా కానుకగా రిలీజ్ అయ్యింది.కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు చాలా దూరంలో ఉండడంతో ప్లాప్ దిశగా వెళుతుంది.
ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రవితేజ తన నెక్స్ట్ సినిమాలను పూర్తి చేస్తున్నారు.

ప్రస్తుతం రవితేజ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.అందులో ”ఈగల్” ( Eagle Movie ) ఒకటి.యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూట్ దాదాపు పూర్తి చేసుకుంది.
ఈ సినిమా కూడా భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తుండగా టీజర్ కు టైం ఫిక్స్ చేసారు మేకర్స్.ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుండగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.
ఇప్పటి నుండే వరుస ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచేయాలని మేకర్స్ చూస్తున్నారు.మరి తాజాగా కొద్దిసేపటి క్రితం టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైం ఫిక్స్ చేసి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు.

6న ఉదయం 10 గంటల 44 నిముషాలకు ఈగల్ టీజర్ ( Eagle Teaser ) రివీల్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.మరి ఈ టీజర్ కట్ ఎలా ఉంటుందో చూడాలి.ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameswaran ), కావ్య థాపర్( Kavya Thapar ) హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కాబోతుంది.







