కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ప్రత్యేకహోదా డిలీట్ కావడానికి జీవీఎల్ కారణం.ఈనెల 17న కేంద్ర హోంశాఖ సమావేశంలో తొలగించిన ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలి.
ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేసీఆర్ కూడా చెప్పారు.ఏపికి జరిగిన అన్యాయంపై 22 మంది వైసీపీ ఎంపి లు అనేక సార్లు పార్లమెంటులో మాట్లాడాము.
వైసీపీ ఎంపి లు మాట్లాడటం వల్లే ప్రధాని మోదీ ఆంధ్రాకు అన్యాయం జరిగిందని అన్నారు.కోడలు మగబిడ్డను కంటానంటే అత్తగారు వద్దంటుందా అని చంద్రబాబు మహిళల్ని అవహేళన చేశారు.
ఏ మొఖం పెట్టుకుని టీడీపీ మహిళలు దీక్షలు చేస్తున్నారు? పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2,100 కోట్లు రీఎంబర్స్ చెయ్యాల్సి ఉంది.ఏపిలో కొత్త జాతీయ రహదార్లు వేస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు.
కేంద్రం క్రెడిట్ మేము తీసుకోము.







