మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి.ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలీదు కానీ ఎక్కువమంది మంచు విష్ణును( Manchu Vishnu ) టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా మంచు మనోజ్( Manchu Manoj ) విష్ణుతో విభేదాల గురించి స్పందించాలని కోరినా స్పందించడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు.అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో మనోజ్ విష్ణు గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
మంచు మనోజ్ మాట్లాడుతూ నేను, అక్క ఒక టీం అని ఇద్దరం తోడు దొంగలమని అన్నారు.విష్ణు అన్న ఇంకో టీమ్ అని మనోజ్ చెప్పుకొచ్చారు.చిన్నప్పుడు విష్ణు అన్న చాడీల మాస్టర్ అని మనోజ్ తెలిపారు.అన్న ఇద్దరినీ ఆడుకోవచ్చని అన్న నీట్ గా చదివి మంచి పేరు తెచ్చుకున్నాడని మనోజ్ కామెంట్లు చేశారు.
ఏదైనా నేను చేస్తే హోమ్ వర్క్ రాయలేదని ఇంట్లో చెబుతానని విష్ణు తనతో చెప్పేవాడని మనోజ్ చెప్పుకొచ్చారు.
నువ్వు నా పెన్సిల్ విరగ్గొట్టావని అది చెబుతానని విష్ణు తనతో అనేవాడని మనోజ్ కామెంట్లు చేశారు.ఒకరోజు ట్రాఫిక్ సిగ్నల్ లో దిగిపోవడంతో ఆరు నెలలు నాతో విష్ణు పనులు చేయించుకున్నాడని మనోజ్ అన్నారు.డాడీకి చెబుతానని చెప్పి విష్ణు బెదిరించాడని మనోజ్ చెప్పుకొచ్చారు.
నాకు బర్త్ డే చాక్లెట్స్ వస్తే విష్ణు తీసుకునేవాడని ఆయన అన్నారు.నేను, అక్క, నాన్న ఒక టీమ్ అని అమ్మ, విష్ణు ఒక టీమ్ అని మనోజ్ తెలిపారు.
నాన్నగారిని బాగా ఇమిటేట్ చేస్తానని మనోజ్ అన్నారు.ఆ గాడిదకు చెప్పు సరిగ్గా చదవమని అని నాన్న అక్కకు చెప్పేవారని మనోజ్ తెలిపారు.మనోజ్ ప్రస్తుతం వాట్ ద ఫిష్( What The Fish ) సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా మనోజ్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.