మంజుమ్మల్ బాయ్స్ రివ్యూ అండ్ రేటింగ్?

మంజుమ్మల్ బాయ్స్( Manjummal Boys ) చిదంబరం దర్శకత్వంలో మలయాళంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా అక్కడ ఎంతో మంచి సక్సెస్ సాధించింది.ఇలా ఆ భాషలో సక్సెస్ అయినటువంటి ఈ సినిమాని నేడు తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఇలా తెలుగులోకి నేడు ఏప్రిల్ 6వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందనే విషయానికి వస్తే.

 Manjummel Boys Review And Rating Details, Manjummel Boys,manjummel Boys Movie, M-TeluguStop.com

కథ:

కేరళలోని కొచ్చికి చెందిన మంజుమ్మల్ బాయ్స్.కుట్ట‌న్‌ (షౌబిన్ షాహిర్‌),( Shoubin Shahir ) సుభాష్ (శ్రీనాథ్ భాషి) ( Sreenath Bhasi ) మరియు వీరి మిత్రులంద‌రూ చిన్న‌చిత‌కా ఉద్యోగాలు చేసుకుంటూ సరదాగా తమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఒకరోజు మంజుమ్మల్ బాయ్స్ అందరూ కూడా కొడైకెనాల్ వెకేషన్ వెళ్లాలని ప్లాన్ చేస్తారు అయితే ఈ వెకేషన్ కి శుభాష్ రానని చెప్పగా అతనిని బలవంతంగా కుట్టన్ ఒప్పించి వెకేషన్ తీసుకువెళ్తారు ఇలా వెకేషన్ వెళ్ళినటువంటి వీరు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే అక్కడ గుణ అనే ఒక కేవ్స్ ఉంటాయి.

Telugu Chidambaram, Manjummel, Manjummel Story, Shoubin Shahir, Sreenath Bhasi-M

ఇవి చాలా లోతైన ప్రమాదకరమైన గుహలు అయితే ఇక్కడికి వెళ్లడానికి పర్మిషన్ ఉండదు.ఒకవేళ ఎవరైనా లోపలికి వెళ్తే బయటకు వచ్చి సందర్భాలు అయితే లేవు కానీ ఈ మంజుమ్మల్ బాయ్స్ అక్కడ ఉన్న సెక్యూరిటీ కళ్ళు కప్పి గుహలలోకి వెళ్తారు.అక్కడ ఎంజాయ్ చేసి వస్తున్నటువంటి తరుణంలో సుభాష్ గుహ లోపల ఇరుక్కుపోతారు.మరి గుహలో ఇరుక్కుపోయినటువంటి సుభాష్ ను( Subhash ) మంజుమ్మల్ బాయ్స్ ఎలా సేవ్ చేశారు.అక్కడ వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అన్నది ఈ సినిమా కథ.

నటీనటుల నటన:

షౌబిన్ షాహిర్‌ శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్ వంటి తదితరులు ఈ సినిమాలో నటించారు అయితే వీరందరూ కూడా వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారని చెప్పాలి.

Telugu Chidambaram, Manjummel, Manjummel Story, Shoubin Shahir, Sreenath Bhasi-M

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే.ఒక చిన్న పాయింట్ ఆధారంగా డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి కథను సిద్ధం చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు అని చెప్పాలి.సుశీన్ శ్యామ్ సంగీతం చాలా బాగుంది.షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.

Telugu Chidambaram, Manjummel, Manjummel Story, Shoubin Shahir, Sreenath Bhasi-M

విశ్లేషణ:

ఫ్రెండ్స్ అందరూ కలిసి వెకేషన్ లోకి వెళ్లి ఎంజాయ్ చేయడం అక్కడ సమస్యలలో పడటం వంటి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి అయితే ఈ సినిమా కాస్త రియాలిటీ కి దగ్గరగా ఉంది గుహలకు వెళ్లడం అక్కడ తన స్నేహితుల ఇరకపోవడం తనని బయటకు తీసుకురావడం కోసం ఎలా కష్టపడ్డారు అనే అంశాలు చాలా ఉత్కంఠతను కొనసాగిస్తూ ఉంటాయి.మొదటి హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో ఎక్కువగా ఈ సినిమా ఆసక్తి కలిగిందని చెప్పాలి.మొత్తానికి ఒక చిన్న సినిమాకు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠ భరితం చేసిందని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:

కథ కథనం నటీనటుల నటన మ్యూజిక్, ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీతగా ఉంది.అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బోరింగ్

బాటమ్ లైన్:

మంజుమ్మల్ బాయ్స్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్‌ లో( Emotional Survival Thriller ) చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి.

రేటింగ్: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube