మంజుల.( Actress Manjula ) అలనాటి స్టార్ హీరోయిన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించిన గొప్ప నటీమణి.
సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో నటించిన ఆమె చనిపోయి దశాబ్ద కాలం గడిచింది.హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన మంజుల తన తోటి నటుడు అయినా విజయ్ కుమార్ ని( Vijay Kumar ) ప్రేమించి పెళ్లి చేసుకొని ముగ్గురు కూతుళ్ళకు తల్లి అయ్యింది.
తన ముగ్గురు కూతుళ్లను ఇండస్ట్రీ కి కూడా పరిచయం చేసిన మంజుల వారి జీవితంలో మాత్రం ఎన్ని చెడు పరిణామాలకు కారణం అయ్యారు.తన కుటుంబం నుంచి నట వారసులుగా ఉండాలని తన అందరి పిల్లలలను హీరోయిన్స్ గా పరిచయం చేసారు.
అయితే వారి ఇష్టం మేరకు నటిస్తే ఒకే కానీ పెద్ద కూతురు వనిత కు( Vanitha ) అస్సలు హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదు.ఆమె తమిళ్ లో కొన్ని సినిమాలు చేసి తెలుగు లో దేవి అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది.ఇక రెండవ కూతురు ప్రీతీ( Preeti ) రుక్మిణి కళ్యాణం వంటి సినిమాల్లో నటించి తెలుగు వారికి సుపరిచితమే.మూడో అమ్మాయి జూనియర్ శ్రీదేవి( Jr Sridevi ) కూడా అనేక తెలుగు సినిమాల్లో నటించింది.
ముఖ్యంగా ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ గా నటించడం విశేషం.ఇలా ముగ్గురు కూతుళ్లను హీరోయిన్ గా చేసిన మంజుల వారి పెళ్లిళ్ల విషయం లో కూడా కొన్ని తప్పిదాలు చేశారు.
15 ఏళ్లకే హీరోయిన్ గా నటించాలి.18 ఏళ్ళు రాగానే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి.ఇది ఆమె పద్ధతి.ఇది అందరికి ఒకేలా సెట్ అవ్వదు.మంజుల మొదటి కూతురు ఈ పద్ధతి వల్ల బలై పోయింది, చిన్న వయసులో పెళ్లి చేసుకొని భర్త, సంసారం అనే విషయాలను అర్ధం చేసుకోగా విడాకులు తీసుకుంది.ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకొని ఆమె జీవితంలో సెటిల్ కాలేకపోతుంది.
ఇక మంజుల భర్త విజయ్ కుమార్ పెద్ద భార్య కుమార్తె కూడా అంతే.చిన్న వయసులో హీరోయిన్ అయ్యి 18 ఏళ్లకే పెళ్లి చేయడం తో భర్త తో అడ్జస్ట్ అవ్వలేక విడాకులు తీసుకుంది.
ఇలా ఆడపిల్లల విషయంలో మంజుల, విజయ్ కుమార్ ల పద్ధతులు చాల దారుణం గా ఉండేవి.ఇక ఆస్తుల పంపకం లో కూడా వనిత కి విజయ్ చాల అన్యాయం చేశారు.
ఇప్పటికి ఆమె ఒంటరిగానే తన పిల్లలతో ఉంటుంది.