మనీషా కొయిరాలా( Manisha Koirala ) 1991 లో సౌదాగర్ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యింది.నాటి నుంచి నేటి వరకు ఆమె జీవితంలో ఎన్నో జరుగుతూనే ఉన్నప్పటికీ సినిమాలు మాత్రం చేస్తూనే ఉంది.
ఇప్పుడు హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ గానే ఉంది.ప్రతి ఏటా సినిమాల్లో నటిస్తుంది.
అయితే ఆమె సినిమా జీవితం అందరికి తెరిచిన పుస్తకమే.కానీ వ్యక్తి గత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయ్.
ఆమె ప్రేమ, పెళ్లి అనే విషయాల్లో మాత్రం ఫెయిల్యూర్( Failure ) అని చెప్పాల్సిందే.అందుకు ఎన్నో కారణాలు ఉండచ్చు.
కానీ ప్రస్తుతం మాత్రం మనీషా 53 ఏళ్ళ వయసులో ఒంటరిగానే ఉంది.ఆమెకు సంబందించిన అన్ని విషయాలు కాదు గాని మనసు ముక్కలు చేసిన నానా పాటేకర్ గురించి కొన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

20 ఏళ్ళు పెద్ద వాడైనా నానా తో మనీషా కొయిరాలా ప్రేమ బంధం గురించి బాలీవుడ్ మీడియా కథలు( Bollywood media stories ) కథలుగా చెప్పుకునే వారు.అగ్ని సాక్షి సినిమాతో మొదటి సారి మనీషా నానా కలిసి పని చేసారు.అప్పటికే నానా పాటేకర్( Nana Patekar ) పెళ్లయింది కానీ భార్యతో విడిగా ఉంటున్నాడు.అలాగే మనీషా కూడా లవ్ బ్రేకప్ తో డిప్రెషన్ లో ఉంది.
దాంతో రహస్యంగా వీరిద్దరూ ప్రేమలో పడి రిలేషన్ ని కూడా కొనసాగించారు.అప్పట్లో మనీషా పక్కింట్లో ఉంటె ఒక మహిళా నానా రోజు ఇంటికి రావడాన్ని వ్యతిరేఖించింది.
ఆలా మొత్తానికి వీరి బంధం బహిర్గతం అయ్యింది.కానీ నానా మరియు మనీషా ఇద్దరు కూడా షార్ట్ టెంపర్ కలిగినవారు.
అయితే నానా మనీషా ను ప్రేమించడం మొదలెట్టాక పోసిసివ్ గా కూడా మారిపోయి మనీషా బట్టల విషయంలో, కో స్టార్స్ తో క్లోజ్ గా మూవ్ అవ్వడం లో ఆంక్షలు పెట్టేవాడు.ఈ విషయం పై ఇద్దరు బాగా గొడవలు పడి మాట్లాడుకోవడం మానేసేవారు.

పైగా ఆ సమయంలో నానా తన మొదటి భార్య విడాకులు ఇచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు.ఇక ఈ టైం లో నానా అయేషా జుల్కతో ఒక రూమ్ లో ఉండగా చూడకూడని విధంగా మనీషా చేసేయడం తో గట్టి గట్టిగ అరుస్తూ అయేషా ను బాగా తిట్టేసి ఆ రోజే నానా తో బ్రేకప్ చేసుకొని కొత్త జీవితాన్ని మొదలెట్టింది.నానా పాటేకర్ పై ఉన్న కోపం తో వివాహం కూడా చేసుకుంది కానీ అది ఎక్కువ రోజులు కొనసాగలేదు.ఇక అప్పటి నుంచి ఆమె లవ్ అఫైర్స్ కూడా తగ్గిపోయాయి.







