ఆ బాబు పై ఈ బాబు ఫైర్ ! అసలేమైంది ?

ఒకప్పుడు ప్రాణస్నేహితులుగా సాలిసిమెలిసి ఉంటూ తెలుగుదేశం పార్టీలో గుర్తింపు తెచ్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, సినీ నటుడు మంచు మోహన్ బాబు మధ్య స్నేహానికి బీటలు వారి ప్రత్యర్థులుగా మారిపోయారు.

ఇక అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే వస్తున్నారు.

ఎన్నికల ముందు కూడా టీడీపీ కి వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా మోహన్ బాబు ప్రచారం కూడా చేసాడు.అయితే ఎన్నికల ఫలితాల నుంచి ఆయన సైలెంట్ గానే ఉంటూ వస్తున్నాడు.

మీడియాకు కూడా దూరంగానే ఉంటూ వస్తున్నాడు.తాజాగా మోహన్ బాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు మోహన్ బాబు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.మోహన్ బాబు క్రమశిక్షణ లేని వ్యక్తి అంటూ వ్యాఖ్యానించారు.

Manchu Mohan Babu Comments On Chandrababu Naidu
Advertisement
Manchu Mohan Babu Comments On Chandrababu Naidu-ఆ బాబు పై ఈ బ

దీనిపై మోహన్ బాబు కూడా అదే రీతిలో ఘాటుగా స్పందించాడు.చంద్రబాబు ని టార్గెట్ చేసుకుంటూ వరుసగా ట్విట్లు చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది.మోహన్ బాబు ట్విట్స్ ఒకసారి పరిశీలిస్తే చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.

ఇప్పుడు అంతా ప్రశాంత వాతావరణం నెలకొంది.ఈ సమయంలో మళ్లీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు.

Manchu Mohan Babu Comments On Chandrababu Naidu

రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుంచి రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ మోహన్ బాబు ఆ ట్విట్ లో పేర్కొన్నారు.నా మనసును నువ్వు చాలా గాయపరిచావు.అన్న ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు, నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు.

అది అందరికీ తెలిసిన విషయమే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది నువ్వు ఒక్కడివే.దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేలా ప్రస్తావించకు.అది నీకు నాకు మంచిది.

Advertisement

ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే.ఉంటా!’’ అంటూ సోషల్ మీడియాలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మోహన్ బాబు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో మోహన్ బాబు చేసిన నిరసన, ధర్నా ఇద్దరిమధ్య మరింత దూరాన్ని పెంచిందనే చెప్పాలి.ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.

ఇక ఇదే అదునుగా వైసీపీ కూడా మోహన్ బాబు ని వాడుకుని చంద్రబాబు మీద విమర్శలు చేయించేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.

తాజా వార్తలు