రేర్ ఫీట్ సాధించిన భూమా మౌనిక రెడ్డి.... అసలు విషయం చెప్పిన మంచు మనోజ్?

భూమా మౌనిక రెడ్డి ( Bhuma Mounika Reddy ) పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ రాజకీయ నాయకులు నాగిరెడ్డి శోభనాగిరెడ్డి కుమార్తెగా ఈమె అందరికీ సుపరిచితమే అయితే ప్రస్తుతం ఈమె మంచు మనోజ్ ( Manchu Manoj ) భార్యగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

మంచు మనోజ్ మౌనికను వివాహం చేసుకున్న తర్వాత ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.

ఇక మనోజ్ సైతం తనకు తన భార్యకు సంబంధించిన ఏ విషయం అయినా వెంటనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.అయితే తాజాగా తన భార్య సాధించిన అరుదైన రికార్డు గురించి మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇంటర్నేషనల్ యోగ డే ( International Yoga Day ) సందర్భంగా భూమా మౌనిక ఏకంగా 108 సూర్య నమస్కారాలను( 108 Surya Namaskaralu ) పూర్తి చేసినట్లు ఈయన సోషల్ మీడియా వేదికగా మౌనిక యోగాసనం చేస్తున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ మై వైఫ్ అంటూ అసలు విషయం వెల్లడించారు.అయితే మౌనిక అంతకుముందే సోషల్ మీడియా వేదికగా యోగాసనం చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈమె ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.నా మిత్రులందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు.ఈరోజు 108 సూర్య నమస్కారాలను పూర్తి చేసి యోగ పై నా ప్రేమకు అంకితం చేస్తున్నాను.

Advertisement

నాకు యోగాను పరిచయం చేసినందుకు మా అమ్మ శోభా నాగిరెడ్డి( Shobha Nagireddy ) కి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మౌనిక కూడా సోషల్ మీడియా వేదికగా అందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది.ఈ విధంగా భూమా మౌనిక ఏకంగా 108 సూర్య నమస్కారాలను చేశారని తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు