మంచు మోహన్ బాబు( Mohan Babu ) వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు నటుడు మంచు మనోజ్( Manchu Manoj ).ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించి హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు కానీ మనోజ్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి కొన్ని సంవత్సరాలపాటు దూరం అయ్యారు.
అయితే ఇప్పుడిప్పుడే ఈయన తిరిగి తన కెరియర్ పై ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.ఒకవైపు వరుస వెళ్లి తెర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా మరోవైపు పలు బుల్లితెర కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి మనోజ్ సిద్ధమయ్యారు.
ఇక ఈయన త్వరలోనే ఉస్తాద్( Ustaad )అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ కార్యక్రమానికి మనోజ్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు.ఇక ఈ షోలో సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక వేడుకలో పాల్గొన్నటువంటి మనోజ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.
తాను ఎలాంటి పరిస్థితులలో ఉన్న అభిమానులు ఎప్పుడూ కూడా తమ ప్రేమను నాపై ఒకే విధంగానే చూపించారని తెలుస్తుంది.
నేను భూమా మౌనిక( Mounika ) ప్రేమలో పడిన తర్వాత ప్రేమ అంటే ఏంటో దాని విలువ ఏంటో నాకు తెలిసిందని తెలిపారు.ముఖ్యంగా అభిమానుల ప్రేమ విలువ నాకు తెలిసిందని నేను ఎలాంటి పరిస్థితులలో ఉన్న నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ తాను ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ ఈ సందర్భంగా ఈయన భూమా మౌనిక గురించి అలాగే అభిమానుల ప్రేమ గురించి ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈయన ఉస్తాద్ అనే షోతో పాటు వాట్ ది ఫిష్( What The Fish) అనే సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.