మంచు లక్ష్మి ఏం మాట్లాడుతున్నావ్ ?

సాధారణంగా ఎవరైనా సెలెబ్రిటీ లు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్సనం చేసుకుంటే వెళ్లి వారితో ముచ్చట్లు మాట్లాడతారు.

అలాగే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి, తన భర్త శ్రీనివాస్ , కుమార్తె లతో కలిసి తిరుమల వెంకన్న ని దర్సనం చేసుకుంటే మీడియా వారు మాట్లాడాలి అని గొడవ చేసారు.

లక్ష్మి కూడా మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామీ అంటే చాలా ఇష్టం అని చెప్పింది.నిజమే మనకి కూడా దేవుడు అంటే ఇష్టమే కానీ ఆమె వెంకటేశ్వర స్వామిని పెదనాన్నగా అనుకుంటూ ఉంటానని తెలిపారు.

అయితే మనకు భగవంతుడితో ఏమైనా పని ఉంటే మోహన్‌బాబుగానీ, ఆయన కుటుంబసభ్యుల ద్వారా గానీ పైరవీ చేసుకోవచ్చన్నమాట! ఫలానా ప్రముఖుడు మాకు బంధువనో, బాగా తెలిసిన వ్యక్తి అనో చెప్పటాన్ని నేమ్ డ్రాపింగ్ అంటారు.మోహన్‌బాబు కుమార్తె, సుప్రసిద్ధ తెలుగు నటి, నిర్మాత, టీవీ షో హోస్ట్ మంచు లక్ష్మీప్రసన్న ఈ విద్యలో పీక్స్‌కు చేరుకున్నారు.

సాక్షాత్తూ ఏడుకొండలవాడితోనే బంధుత్వం కలిపేశారు.

Advertisement
ఫ్లాప్ అయ్యే సినిమాకు వన్ మోర్ ఎందుకన్న బాలయ్య..

తాజా వార్తలు