నన్ను అత్తగా సెలెక్ట్ చేసుకున్నందుకు థాంక్యూ.. మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు మంచు ఫ్యామిలీ( Manchu Family ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మంచు ఫ్యామిలీలో మనోజ్, విష్ణులు ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్న విషయం తెలిసిందే.

మంచు లక్ష్మీ( Manchu Lakshmi ) మాత్రం ప్రస్తుతం ముంబైలోని నివసిస్తోంది.మనుషులకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఏదైనా జరిగింది అంతే చాలు వెంటనే హైదరాబాదులో వాలిపోతూ ఉంటుంది.

మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగిన సందర్భంలో కూడా ఈమె పెద్దగా కనపడకపోయినా కూడా ఆమె కారణంగానే గొడవలు సద్దుమణిగినట్టు వార్తలు వినిపించాయి.ఇకపోతే తమ్ముడు మనోజ్ పెళ్లి హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఆమె దగ్గరుండి మరి జరిపించిన విషయం తెలిసిందే.

Manchu Lakshmi Special Post Manoj Daughter Devasena Details, Manchu Lakshmi, Man

ఇది ఇలా ఉంటే తాజాగా ఇంకా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మంచు మనోజ్( Manchu Manoj ) చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.తమ్ముడు మనోజ్ కూతురిని తెగ ముద్దు చేసేస్తున్న మంచు లక్ష‍్మీ.చిన్నారి దేవసేన( Devasena ) తొలి పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమనంతా బయటపెట్టింది.

Advertisement
Manchu Lakshmi Special Post Manoj Daughter Devasena Details, Manchu Lakshmi, Man

ఈ సందర్భంగా ఆ పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చింది.నువ్వు పుట్టే ముందురోజు దేవుడు నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణం ఉందేమో.

ఎందుకంటే నేనే అప్పటికే వెళ్లిపోవడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను.పని కూడా ఉంది.

కానీ తర్వాత రోజు ఉదయమే నువ్వు పుట్టావ్ దేవసేన.నిన్ను మీ అమ్మనాన్న కాదు నేనే మొదట ఎత్తుకున్నాను.

Manchu Lakshmi Special Post Manoj Daughter Devasena Details, Manchu Lakshmi, Man

రోజంతా నీతోనే గడిపాను.నువ్వు బాగా కనెక్ట్ అయ్యావ్.మనిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.

చలికాలం పొడిచర్మం ఇబ్బందా ? ఈ సలహాలు చూడండి

మాటల్లో అది చెప్పలేను.నన్ను అత్తగా సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్యూ.

Advertisement

నేను నీతో ఉండి అల్లరి చేసే అత్తని.నీ తొలి పుట్టిన రోజున చాలా చెప్పాలని ఉంది.

కానీ నువ్వు ఆనందంగా ఎదగాలి.నీ ప్రపంచం అందంగా ఉండాలి.

నువ్వు మా ఇంటి రాణివి.నిన్ను తర్వలో కిడ్నాప్ చేసి ముంబై తీసుకెళ్లిపోతా.

ఈ డైమండ్ ని నాకు ఇచ్చినందుకు మనోజ్, మౌనికకు థ్యాంక్యూ అని మంచు లక్ష‍్మీ రాసుకొచ్చింది.ఈ సందర్భంగా మంచు లక్ష్మి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.

తాజా వార్తలు