మంచు లక్ష్మికి ఓ మంచి స్క్రిప్ట్‌ దొరికిందట!

మంచు మోహన్ బాబు నట వారసురాలు మంచు లక్ష్మి( Manchu Lakshmi ) మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

హీరోయిన్‌ గా నటించిన ఈమె నిర్మాతగా దర్శకురాలిగా విలన్‌ గా కూడా చేసింది.

బుల్లి తెరపై కూడా సందడి చేసింది.ప్రస్తుతం యూట్యూబ్‌ లో అప్పుడప్పుడు కనిపిస్తుంది.

కానీ సినిమా లు లేదా సిరీస్ ల్లో మాత్రం కనిపించడం లేదు.ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

మల్టీ ట్యాలెంటెడ్‌ అని నిరూపించుకున్న మంచు లక్ష్మి ఎందుకు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అనే ప్రశ్నకు ఇన్నాళ్లు సమాధానం లేదు.ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం లభించింది.

Advertisement

తనకు సూట్ అయ్యే పాత్రలు రాక పోవడం వల్లే ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్చి వచ్చిందని ఆమె సన్నిహితుల వద్ద అన్నారట.ఆమె ప్రతిభ ఆధారంగా దర్శకులు కథలు రాస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.తాజాగా మంచు లక్ష్మికి ఒక మంచి స్క్రిప్ట్‌ దక్కిందట.

ఆ స్క్రిప్ట్‌ పై ప్రస్తుతం వర్క్ జరుగుతుందట.అతి త్వరలోనే ఒక లేడీ ఓరియంటెడ్‌ మూవీ( Lady Oriented Movie ) ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ సినిమాకు తానే స్వయంగా నిర్మాతగా వ్యవహరించబోతున్న మంచు లక్ష్మి ప్రతిభావంతుడైన ఒక వ్యక్తికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించిందని సమాచారం అందుతోంది.

మొత్తానికి మంచు లక్ష్మి హీరోయిన్‌ గా చాలా రోజుల తర్వాత ఒక సినిమా రాబోతున్న నేపథ్యం లో మంచు వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మోహన్‌ బాబు, విష్ణు చేసిన సినిమాలు నిరాశ పరిచాయి.దాంతో మంచు లక్ష్మి అయినా మంచు అభిమానులను( Manchu Fans ) సంతృప్తి పరిచేనా చూడాలి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఇక మంచు మనోజ్ ను ( Manchu Manoj ) తన సినిమా లో గెస్ట్‌ రోల్‌ లో చూపించాలని కూడా మంచు లక్ష్మి ప్రయత్నాలు చేస్తుందట.ఈ ప్రాజెక్ట్‌ ఎప్పటికి ఫైనల్‌ అయ్యేనో చూడాలి.

Advertisement

తాజా వార్తలు